బిట్‌కాయిన్ కొనుగోలు చేస్తున్నారా? ఇది గుర్తుంచుకోండి

BITCOIN


బిట్‌కాయిన్‌తో పాటు ఏదేని క్రిప్టోకరెన్సీపై ఆర్జించే లాభాలు, ట్రేడింగ్ పైన ప్రభుత్వం ఆదాయపు పన్ను, జీఎస్టీ విధించే అవకాశాలు ఉన్నాయి. బిట్‌కాయిన్స్‌ను ఆర్థిక సేవల కింద వర్గీకరించి, వీటిపై 18 శాతం జీఎస్టీ విధించవచ్చునని, బిట్‌కాయిన్ ద్వారా ఆర్జించే లాభాలపై వ్యక్తిగత ఆదాయపు పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారి తెలిపారు. క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ పైన నిషేధాన్ని 2020 మార్చిలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో జీఎస్టీ, ట్యాక్స్ విధించే అవకాశాలు ఉన్నాయి

బిట్ కాయిన్ :

 క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ జోరు కొనసాగుతోంది. బుధవారం ట్రేడింగ్‌లో ఈ డిజిటల్ కరెన్సీ వ్యాల్యూ 6 శాతం పెరిగి చరిత్రలో తొలిసారి 51,000 డాలర్ల పైకి చేరుకుంది. ఓ దశలో 51,431 డాలర్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని తాకింది. భారత కరెన్సీ రూపాయిలో ఇది రూ.38 లక్షలను క్రాస్ చేసింది. గత రెండు నెలలుగా బిట్ కాయిన్ 25వేల డాలర్ల నుండి 50వేల డాలర్లు దాటింది.

క్రిప్టో :

బిట్ కాయిన్ రోజురోజుకు రికార్డులు సాధిస్తోంది. ఇప్పటికే 50వేల డాలర్లు దాటిన ఈ క్రిప్టోకరెన్సీ త్వరలోనే లక్ష డాలర్లకు చేరుకోవచ్చునని అంచనాలు వేస్తున్నారు. మంగళవారం 50వేల డాలర్లు దాటిన ఈ క్రిప్టో, ఇప్పుడు 51వేల డాలర్లు దాటింది. ఇది స్థిరంగా లక్ష డాలర్లకు చేరుకోవచ్చునని చెబుతున్నారు. బిట్ కాయిన్ పెరుగుదలకు ఇన్వెస్టర్లు కారణం. టెస్లా, మాస్టర్ కార్డ్, పేపాల్, మైక్రోస్ట్రాటజీ వంటి గ్లోబల్ దిగ్గజ కంపెనీలు క్రిప్టోకు అనుకూలంగా పాలసీని మార్చడంతో బిట్ కాయిన్ దూసుకెళ్తోంది.

2009లో ప్రారంభం :

బిట్ కాయిన్ ఓ డిజిటల్ కరెన్సీ లేదా క్రిప్టో కరెన్సీ. 2009 జనవరిలో దీనిని తీసుకు వచ్చారు. ప్రభుత్వ కరెన్సీల మాదిరిగా దీనికి నియంతృత్వ వ్యవస్థ లేదు. భౌతిక రూపం లేని క్రిప్టో కరెన్సీ ఇది. ఇన్వెస్టర్ల ఖాతాల్లో మాత్రమే కనిపించే దీని వ్యాల్యూ ప్రస్తుతం భారతీయ కరెన్సీలో రూ.38 లక్షలకు పైగా ఉంది.

BITCOIN గురించిన పూర్తి సమాచారం 

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad