బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు పై ఇచ్చిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని పాఠశాల విద్య సంచాలకులు వి. చినవీరభద్రుడిని YSRTF రాష్ట్ర కమిటీ కోరింది . ఈ మేరకు ఆయన్ను తన కార్యాలయంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.బాలిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పి.అశోక్ కుమార్ రెడ్డి మంగళవారం కలిసి వినతిపత్రం ఇచ్చారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయుల హాజరు కోసం నాసిరకమైన బయో మెట్రిక్ పరికరాలను పాఠశాలలకు మంజూరు చేశారని, వాటిలో కొన్నింటిలో సిమ్లు లేవని, డేటా లేదని, సిగ్నల్స్ అందక ఉపాధ్యాయులు నిమిషాల తరబడి వేచి చూస్తున్నారని తెలిపారు వీటిని నివారించేందుకు వేగంగా పనిచేసే కొత్త పరికరాలు సమకూర్చాలని కోరారు.