పాఠశాలలు రెన్యువల్ చేసుకోవాలి
ఈ జాబితాలో 259 ప్రైవేట్ పాఠశాలలు
రెన్యువల్ తర్వాతే టెన్త్ విద్యార్థుల నామినల్ రోల్స్ స్వీకరణ
ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు సుబ్బారెడ్డి వెల్లడి
అమరావతి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జూన్లో పదో తరగతి పరీ క్షలు రాసే విద్యార్థులు నామినల్ అట్స్, సంబంధిత పాఠశాలల లాగిన్ ద్వారా ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో స్వీకరిస్తామని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు ఎ.సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, 2007 ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 259 ప్రైవేట్ పాఠశాలలకు 2018-20 విద్యా సంవత్సరానికి గుర్తింపు గడువు ముగిసిందని పేర్కొన్నారు. ఆయా పాఠశాలలను పలుమార్లు హెచ్చరించినప్పటికీ గుర్తింపును పనరుద్దరించుకోలేదన్నాడు. అందు వల్ల సదరు పాఠశాలలకు సంబంధించిన ఆన్లైన్ నామినల్ రోల్స్ స్వీకరించబోమని తెలిపారు. ఈ 250 ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు పత్రాలను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారి కార్యాలయపు e- mail కు పంపిన తర్వాత మాత్రమే వారి పాఠశాలకు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ లు జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గుర్తింపు ముగిసిన schools వివరాలు ప్రభుత్వ పరీక్షల కార్యాలయము website www.bse.ap.gov.inలో పొందు పరిచినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, గడువు ముగిసిన ఈ 20 ప్రైవేట్ స్కూళ్లలో 2288 మంది విద్యార్థులు చదువు కుంటున్నారు. ఆయా పాఠశాలలు గుర్తింపును రెన్యువల్ చేసుకునేందుకు ఎసిల్ 15 వరకు గడువు ఇచ్చినట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. రాజా సమాచారంప్రకారం ఈ సంఖ్య 160 కి తగ్గినట్టు సమాచారం .
గుర్తింపులేని పాఠశాలలో వివరాల సేకరణ నిలిపివేత
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో గుర్తింపులేని 160 పాఠశాలల నుంచి పదో తరగతి విద్యార్థుల వివరాలను తీసుకోవడం నిలిపివేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సుబ్బారెడ్డి తెలి పారు 2019-20 సంవత్సరంతో అనుబంధ గుర్తింపు ముగిసినా ఈ యాజమాన్యాలు ఇంత వరకు వునరుద్ధరించుకోలేదన్నారు. అనుమతి లేని పాఠశాలల వివరాలను వెబ్ సైట్లో అందు బాటులో ఉంచామని, ఒకవేళ గుర్తింపును పున రుద్ధరించుకుంటే ధ్రువపత్రాలను ప్రభుత్వ పరీక్షల విభాగం మెయిలక్కు పంపించాలని సూచించారు. గుర్తింపు పునరుద్ధరణకు ఏప్రిల్ 15వరకు సమయం ఇచ్చారని, ఈలోగా అనుమ తులు తీసుకోవాలని వెల్లడించారు.