FITBIT ఫిట్‌నెస్‌ బ్యాండ్‌.. పిల్లల కోసం ప్రత్యేకం!


ఈ రోజుల్లో ఫిట్‌నెస్‌ బ్యాండ్‌లకు యువతలో క్రేజ్‌ పెరుగుతుంది. అందుకే ఈ క్రేస్‌ కోసమే మార్కెట్‌లోకి అనేక ఫిట్‌నెస్‌ బ్యాండ్‌లను విడుదల చేస్తున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ ‘ఫిట్‌బిట్‌’ కూడా ఈ క్రమంలోనే ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ ఏస్‌ 3ను లాంచ్‌æ చేసింది. గూగుల్‌ మౌంటెన్‌ వ్యూ 2.1 సంస్థ బిలియన్‌ డాలర్ల (సుమారు రూ .15,320 కోట్ల)ను వెచ్చించి ఫిట్‌ బిట్‌ను ఇటీవలే సొంతం చేసుకుంది.

పూర్తిస్థాయి వాటర్‌ రెసిస్టెంట్‌

కొత్త ఫిట్‌బిట్‌ ఏస్‌ 3 ఆరేళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించింది. టచ్‌–ఎనేబుల్డ్‌ డిస్‌ప్లేతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే చాలు ఎనిమిది రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఇది నీటిలో పడి 50 మీటర్ల లోతుకు వెళ్లినా ఎటువంటి డ్యామేజ్‌ కాదు. అందుకే, ఇది స్విమ్మింగ్‌ సమయంలో ధరించడానికి అనుకూలంగా ఉంటుందని ఫిట్‌ బిట్‌ తెలిపింది. అమెరికా మార్కెట్‌లో ఈ ఫిట్‌బిట్‌ ఏస్‌ 3 ధర 99.99 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ .7,300). ఇది సిలికాన్‌ బ్యాండ్, అడ్జెస్టెబుల్‌ క్లాస్ప్‌తో వస్తుంది. ఈ ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ బ్లాక్‌/ స్పోర్ట్‌ రెడ్, కాస్మిక్‌ బ్లూ/ ఆస్ట్రో గ్రీన్‌ వంటి రెండు కలర్‌లో లభిస్తుంది. ఫిట్‌బిట్‌ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయడానికి ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ అందుబాటులో ఉంది. మార్చి 15 నుంచి దీని డెలివరీలు ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది.


ఈ ఫిట్‌బిట్‌ పిల్లలను ఫిట్‌గా ఉంచేందుకు ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు. ఈ ఫిట్‌ బ్యాండ్‌ల సాయంతో తల్లిదండ్రులు వారి పిల్లల హెల్త్‌ను సులభంగా తెలుసుకోవచ్చు. అంతేకాదు ఇది వారి హృదయ స్పందన రేటును కూడా ట్రాక్‌ చేస్తుంది. పిల్లల రోజూవారి నడక, వ్యాయామాన్ని పరిశీలించి వారి అచీవ్‌మెంట్స్‌ను తెలియజేస్తుంది. వారి ఫిట్‌నెస్‌ విజయాలకు వర్చువల్‌ బ్యాడ్జ్‌లతో పిల్లలకు రివార్డ్‌ లు అందిస్తుంది. అలాగే స్లీప్‌ ట్రాకింగ్, బెడ్‌టైమ్‌ రిమైండర్, సైలెంట్‌ అలారంగా కూడా పనిచేస్తుంది. దీనికి టచ్‌ స్క్రీన్‌ ఉండి, అద్భుతమైన లుక్‌ దీని సొంతం.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad