Adhar స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం.. ఈ ఫోన్ నంబ‌ర్‌.. 12 భాష‌ల్లో ల‌భ్యం..!

ఆధార్ కార్డుకు సంబంధించి ఏమైనా స‌మస్య‌లు ఉన్నాయా ? అయితే కేవ‌లం ఒక ఫోన్ నంబ‌ర్‌కు డ‌య‌ల్ చేయ‌డం ద్వారా ఆ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చు. అవును.. ఇందుకు గాను UIDAI ఓ ప్ర‌త్యేక నంబ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 1947 అనే నంబ‌ర్‌కు డ‌య‌ల్ చేయ‌డం ద్వారా మీకు ఉన్న ఆధార్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చు. ఈ మేర‌కు UIDAI ట్వీట్ చేసింది. ఈ నంబ‌ర్ 12 భాష‌ల్లో అందుబాటులో ఉంది.


ఆధార్‌కు సంబంధించిన అన్ని సమస్యలూ ఒకే ఒక‌ ఫోన్ కాల్‌తో పరిష్కారమవుతాయని UIDAI ట్వీట్ చేసింది. 1947 అనే ఆధార్ హెల్ప్‌లైన్ నంబ‌ర్‌కు కాల్ చేయ‌డం ద్వారా ఆధార్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చు. ఈ నంబ‌ర్‌లో హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ భాషలలో స‌హాయం ల‌భిస్తుంది. ఇక ప్ర‌జ‌లు ఈ నంబ‌ర్‌కు కాల్ చేసి త‌మ‌కు నచ్చిన భాష‌ను ఎంచుకుని ముందుకు కొన‌సాగ‌వ‌చ్చు. త‌మకు ఉండే ఆధార్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చు.

1947వ సంవ‌త్స‌రంలో భార‌త్ కు స్వాతంత్య్రం ల‌భించింది. అందువ‌ల్ల ఆ సంఖ్య‌తో కూడిన నంబ‌ర్ అయితే ప్ర‌జ‌ల‌కు సుల‌భంగా ఉంటుంది. అందుక‌నే ఈ నంబ‌ర్‌ను ఆధార్ స‌మ‌స్య‌ల‌కు హెల్ప్ లైన్ నంబ‌ర్‌గా ఏర్పాటు చేశామ‌ని UIDAI తెలియ‌జేసింది. ఇక ఇది టోల్ ఫ్రీ నంబ‌ర్‌. అందువ‌ల్ల దీనికి కాల్ చేస్తే ప్ర‌జ‌ల‌కు ఎలాంటి చార్జిలు ప‌డ‌వు. అలాగే ఈ నంబ‌ర్ ఐవీఆర్ఎస్ మోడ‌ల్ ద్వారా ప‌నిచేస్తుంది. ఉద‌యం 7 నుంచి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు, సోమ‌వారం నుంచి శ‌నివారం వ‌ర‌కు ఈ నంబ‌ర్ ద్వారా క‌స్ట‌మ‌ర్ కేర్ ప్ర‌తినిధులు అందుబాటులో ఉంటారు. ఇక ఆదివారం ఉద‌యం 8 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు వారు అందుబాటులో ఉంటారు.

ఈ హెల్ప్‌లైన్ నంబర్ ప్రజలకు ఆధార్ నమోదు కేంద్రాలు, నమోదు తర్వాత ఆధార్ సంఖ్య స్థితి, ఇతర ఆధార్ సంఖ్యల గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఇది కాకుండా ఆధార్ కార్డు పోయినట్లయితే లేదా ఇంకా పోస్ట్ ద్వారా స్వీకరించబడకపోతే ఈ సౌకర్యం సహాయంతో సమాచారం పొందవచ్చు. స‌మ‌స్య‌ల‌ను పరిష్క‌రించుకోవ‌చ్చు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad