Adhar Card: మీ ఆధార్ కార్డ్ పోగొట్టుకున్నారా ? వెంటనే ఇలా లాక్ చేసుకోండి..


Aadhaar Card: ఆధార్ కార్డ్… ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతీయ పౌరుడిగా గుర్తింపు పొందడానికి ముఖ్యంగా ఆధార్ ఉండాల్సిందే. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందుకోవాలంటే కచ్చితంగా ఆధార్ ఉండాల్సిందే. అలాగే ఆధార్ ఉంటేనే ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయ్యెచ్చు. అందుకే ఆధార్ కార్డు మనకు చాలా ముఖ్యం. ఒకవేళ అది పొరపాటున పొగొట్టుకుంటే ఎలా… మళ్లీ మీ కార్డును తీసుకోవడానికి ఆధార్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉండాలి. అలాగే మీ కార్డును ఎవరు దుర్వినియోగం చేయకుండా ఉండాలంటే వెంటనే మీరు దానిని లాక్ చేయాల్సి ఉంటుంది. దీని వలన మీ కార్డు ఎలాంటి దుర్వినియోగం జరగదు. 

అయితే మీ ఆధార్ కార్డును ఎలా లాక్ చేయాలని ఆలోచిస్తున్నారా ? అందుకు పెద్దగా ఏం చేయాల్సిన పని లేదండి. ముందుగా ఆధార్ లాక్ చేసుకోవడానికి మీరు యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ మై ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఆధార్ సర్వీసెస్ అని ఉంటుంది. ఇందులో మీరు లాక్, అన్‌లాక్ బయోమెట్రిక్స్ ఆప్షన్ ఎంచుకోవాలి.  aadhar card ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సెంట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‏కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయాలి. aadhar card ఆ వెంటనే మీ ఆధార్ బయోమెట్రిక్స్ లాక్ అవుతాయి. మీరు ఎంఆధార్ యాప్ ద్వారా కూడా సులభంగానే బయోమెట్రిక్స్‏ను లాక్, ఆన్ లాక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇవే కాకుండా.. ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఈ సేవలు పొందవచ్చు.

Aadhar Website

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad