ఏపీలోని ఆ జిల్లాలోనే కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?

 


ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  రోజు 35 వేలకు పైగా టెస్టులు చేస్తుండగా ఆరు నుంచి ఏడు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  పాజిటివ్ కేసుల శాతం క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.  35 వేల టెస్టులు చేస్తేనే ఏడువేలకు పైగా కేసులు వస్తే ఇక లక్ష వరకు రోజువారీ టెస్టులు నిర్వహిస్తే ఎన్ని కేసులు వస్తాయో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా చిత్తూరు, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.  

ఈ ప్రాంతాల్లో కేసులు పెరగడంపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.  గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతం కావడం, అటు చిత్తూరు జిల్లా రెండు రాష్టాల సరిహద్దుల్లో ఉండటం, తూర్పు గోదావరికి విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో కేసులు పెరుగుతున్నాయని అనుకోవచ్చు.  మొదటి వేవ్ లో కూడా గుంటూరు, తూర్పుగోదావరితో పాటుగా చిత్తూరు జిల్లాలోనే కేసులు అధికంగా నమోదవుతూ వచ్చాయి.  

సెకండ్ వేవ్ లో కూడా కేసులు ఆ మూడు జిల్లాల నుంచే అధికంగా ఉండటంతో అధికారులు ఆయా జిల్లాలపై దృష్టి సారించారు.  మొదటిదశ కరోనా క్రమంగా తగ్గుముఖం పట్టిన తరువాత ప్రజలు మాస్క్ లను పక్కన పెట్టడంతో పాటుగా ఎన్నికల నిర్వహణ సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఒక చోట గుమికూడటం వలన కూడా కరోనా చాపకింద నీరులా వ్యాప్తి చెంది ఉండొచ్చు.  

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad