మీ ఇంట్లో కరోనా బాధితులున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రాలు ఫుల్ అయిపోయాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేసింది. కరోనా బాధితులను హోం క్వారంటైన్ చేసి ఇంట్లోనే చికిత్స అందించాలని సూచించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలు కరోనా బాధితులను హోం క్వారంటైన్‌ చేసి చికిత్స అందిస్తున్నాయి. అయితే చాలా మంది కరోనా బాధితులకు హోం క్వారంటైన్‌లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే విషయంపై స్పష్టత లేదు. బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్రింది విధంగా తెలుసుకుందాం.


కరోనా బాధితుడిని హోం క్వారంటైన్ చేసినప్పుడు కుటుంబీకులు తగిన జాగ్రత్తలు పాటించాలి. బాధితుడికి ప్రత్యేక గదిని కేటాయించాలి. రోగనిరోధక శక్తిని పెంచే పౌష్టికాహారాన్ని అందించాలి. రోజూ వేడినీళ్లు తాగడానికి ఇవ్వాలి. రోగి దగ్గరికి కుటుంబీకులు వెళ్లినప్పుడు పీపీఈ కిట్లు ధరించడం ఎంతో ఉత్తమం. అలాగే సామాజికదూరం కూడా పాటించాలి. ప్రతిరోజు రోగి వాడే వస్తువులను, బట్టలను వేడి నీటిలో శుభ్రం చేయడం.. వాటి పడేసిన పదార్థాలు, వస్తువులను భూమిలో పాతి పెట్టడం చేయాలి.

ఇంట్లో ఎవరికైనా కరోనా వైరస్ సోకినట్లయితే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం అలవాటు చేసుకోవాలి. డబుల్ మాస్క్ లేదా ఎన్-95 మాస్కులు ఉపయోగించాలి. బాధితుడిని ఒకే గదికి పరిమితం చేయాలి. అలాగే అతడి సంరక్షణ బాధ్యతలు చూసుకోవడానికి ఒకరిని నియమించుకుంటే.. ఆహారం, బట్టలు, టాబ్లెట్ వంటి ఇచ్చేందుకు వీలుగా ఉంటుంది. తరచూ గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. హైపోక్లోరైడ్ ద్రావణాన్ని గది మొత్తం పిచికారీ చేయించాలి.

కరోనా బాధితుడి దగ్గరికి వెళ్లినప్పుడు కచ్చితంగా మాస్కు ధరించాలి. అలాగే ఇంట్లో శానిటైజర్ మెయిన్‌టెన్ చేయాలి. రోగిని తాకినప్పుడు లేదా, ఆ గదిలోకి వెళ్లి వచ్చాక శానిటైజర్‌తో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. స్నానం చేసేటప్పుడు ద్రవ శానిటైజర్‌ను కలిపి స్నానం చేసుకోవచ్చు. దీంతో శరీరంపై ఉన్న కరోనా వైరస్ చనిపోతుంది. అలాగే సమీప వైద్య కేంద్రానికి వెళ్లి పోవిడోన్ అయోడిన్ తీసుకోవాలి. దీన్ని రోజుకీ రెండుసార్లు గోరువెచ్చని నీటితో కలిపి ఇళ్లు మొత్తం శుభ్రంగా కడగాలి. అలాగే ప్రతిఒక్కరూ కాళ్లను షూ కవర్స్ వాడాలి. దీంతో కాళ్లకు వైరస్ సోకే ప్రమాదం తక్కువగా ఉంటుంది. బాధితుడికి ఎక్కువ ద్రవ పదార్థ రూపంలో పౌష్టికాహారాన్ని అందించాలి. డ్రై ఫ్రూట్స్, విటమిన్స్ ఉండే పండ్లను ఇవ్వాలి. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత జ్వరం దగ్గు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు కోవిడ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి సలహాలు తీసుకోవాలి

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad