పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా భారిన పడ్డారు. శుక్రవారం స్వల్ప అస్వస్తతో హైదారబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ నిర్వహించిన కరోనా పరీక్షలలో పవన్ కళ్యాణ్‌కు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని జనసేన టీం అదికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం పవన్ ఆరోగ్యంగానే ఉన్నారని… వైద్యులు చికిత్స అందిస్తున్నారని ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కొరలు చాస్తోంది. గతంలో ఎన్నడు లేని విధంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం కరోనా కట్టడికి చర్యలు చేపట్టాయి. ఇప్పటికే స్కూల్స్, కాలేజీలు మూత పడ్డాయి. సామాన్య ప్రజల నుంచి ప్రముఖుల వరకు ఏ ఒక్కరిని వదలకుండా.. అందరికి సోకుతుంది. ఇప్పటికే పలువురు సీఎంలను, కేంద్ర మంత్రులతోపాటు.. సినీ సెలబ్రెటీలను సైతం వదలకుండా.. ప్రతి ఒక్కరికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో క్యారంటైన్ లోకి వెళ్లారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. తాజాగా పవన్ హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ప్రస్తుతం క్యారంటైన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పవన్ కు చికిత్స చేసిన వైద్యులు అనంతరం కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో ఊపిరితిత్తులో స్వల్ప ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా వచ్చిందట. ఇదిలా ఉంటే కరోనా పరీక్షల్లో పవన్ కళ్యాణ్ కు నెగటివ్ వచ్చిందని వార్తలు వచ్చాయి. తాజాగా పవన్ కరోనా భారీన పడినట్టు జనసేన యూనిట్ ప్రకటించింది. మరీ ప్రస్తుతం పవన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారా, లేదా పరీక్షలు చేయించుకున్న తర్వాత తిరిగి ఇంటికి వెళ్లారా అనే దానిపై క్లారిటీ లేదు.అయితే పవన్ కళ్యాణ్ ఆరోగ్య విషయంలో అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. కాగా, వకీల్ సాబ్ టీంలో దిల్ రాజు, నివేదా థామస్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
శ్రీ @PawanKalyan గారికి కోవిడ్ పాజిటివ్
— JanaSena Party (@JanaSenaParty) April 16, 2021
ఆయన క్షేమం... కొనసాగుతున్న చికిత్స pic.twitter.com/089nooZUlV