రాత్రి కర్వ్ఫూ ఆలోచనలో సర్కార్.
రేపు కరోనా కట్టడి పై ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో హై లెవల్ మీటింగ్ జరగనుంది. అయితే ఇందులో కరోనా నియంత్రణ పై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పదవ తరగతి పరీక్షలు రద్దు అలాగే ఇంటర్ పరీక్షలు వాయిదా పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పరీక్షల రద్దుతో పాటుగా స్కూళ్లకు శెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఇక రాత్రి కర్వ్ఫూ ఆలోచనలో సర్కార్... దేవాలయాల్లో, మత సంస్థలతో పాటుగా బార్లు, రెస్టారెంట్ల పై ఆంక్షలు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మార్కెట్లు, దుకాణాల విషయంలో సమయం ఆంక్షలు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం... వ్యాక్సినేషన్, కోవిడ్ కేర్ సెంటర్ల పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. వాలంటీర్లతో ఇంటింటికి ఆరోగ్య సర్వే చేయించే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి రేపు ఏం జరుగుతుంది అనేది.
Source: NTV