ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ BYJU'S‌ పరం..!

డీల్‌ విలువ రూ.7,300 కోట్లు

విద్యా రంగంలో అతిపెద్ద ఒప్పందమిదే 


 న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌ బైజూస్‌ మరో కంపెనీని కొనుగోలు చేసింది. మెడికల్‌, ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ‘ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ (ఏఈఎ్‌సఎల్‌)’ను 100 కోట్ల డాలర్లకు (సుమారు రూ.7,300) కొనుగోలు చేసింది. ఇందులో 60 నుంచి 65 శాతం నగదు రూపంలో మిగతా మొత్తం బైజూస్‌ ఈక్విటీలో వాటా రూపంలో లభిస్తుందని ఏఈఎ్‌సఎల్‌ ఎండీ ఆకాశ్‌ చౌదరి చెప్పారు. ఏఈఎ్‌సఎల్‌ ఈక్విటీలో బ్లాక్‌స్టోన్‌ కంపెనీకి ఉన్న 37.5 శాతం వాటా కూడా బైజూస్‌ పరం కానుంది. బైజూ్‌సకు సంబంధించి ఇది అతి పెద్ద కొనుగోలు. విద్యా రంగానికి సంబంధించి చూస్తే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కొనుగోలుగా భావిస్తున్నారు.

బైజూస్‌ వాల్యుయేషన్‌ రూ.85,290 కోట్లు: ఆకాశ్‌ డీల్‌తో బైజూస్‌ వాల్యుయేషన్‌ ఏకంగా 1,300 కోట్ల డాలర్లకు (సుమారు రూ.85,290 కోట్లు) చేరింది. దేశంలో మరే స్టార్టప్‌ కంపెనీ వాల్యుయేషన్‌ ప్రస్తుతం ఈ స్థాయిలో లేదు. కేరళకు చెందిన రవీంద్రన్‌ ఈ స్టార్టప్‌ కంపెనీని ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌  ఎడ్యుకేషనల్‌ సేవలకు సంబంధించి బైజూస్‌ ఇప్పటికే అనేక కంపెనీలను టేకోవర్‌ చేసింది. వివిధ కోర్సుల కోసం ఈ యాప్‌లో ఇప్పటి వరకు ఎనిమిది కోట్ల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఏటా 55 లక్షల మంది పెయిడ్‌ ఖాతాదారులు ఉన్నారు. వీరిలో ఏటా సగటున  86 ు మంది  తమ సబ్‌స్ర్కిప్షన్లను రెన్యూవల్‌ చేస్తారు. కాగా బైజూస్‌ టేకోవర్‌ తర్వాత కూడా ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ కంపెనీ ప్రత్యేక కంపెనీగానే పని చేస్తుంది.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad