CARONA ఎఫెక్ట్: సముద్రం ఒడ్డున క్లాసులు...


కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది.  కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న తరుణంలో స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తున్నారు.  విద్యాలయాలు కరోనా వ్యాప్తికి కారణమౌతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.  ప్రపంచదేశాల్లో కరోనా భయం ఇంకా వెంటాడుతూనే ఉన్నది.  కొన్ని దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా మళ్ళీ రాదనే గ్యారెంటీ లేకపోవడంతో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ఇదిలా ఉంటె, స్పెయిన్ దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఏ స్థాయిలో ఉన్నదో చూశాం. 

 గతంలో ఆ దేశంలో పెద్ద ఎత్తున కేసులు, మరణాలు సంభవించాయి.  కాగా, ఇప్పుడిప్పుడే ఆ దేశం మహమ్మారి నుంచి కోలుకుంటోంది.  స్కూళ్ళు తిరిగి తెరుచుకున్నాయి.  అయితే, ఆ దేశంలోని ఓ స్కూల్ వినూత్నంగా ఆలోచించింది.  ప్రకృతి మధ్యన, భౌతిక దూరం పాటిస్తూ విద్యార్థులకు విద్యాబోధన చేయాలని నిర్ణయం తీసుకుంది.  ఇందులో భాగంగానే సముద్రం ఒడ్డున తరగతులను నిర్వహించడం మొదలుపెట్టింది. సముద్రం ఒడ్డున ఏర్పాటు చేసిన తరగతులకు విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరవుతూ పాఠాలు నేర్చుకుంటున్నారు

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad