Google Maps: మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమైన గూగుల్.. ఆ ఫిచర్‌తో ప్రయోజనాలేంటంటే..

 గూగుల్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతోంది. యూజర్స్‌కి మెరుగైన సేవలు అందించేందుకు గూగుల్‌ మరోసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయాజాలాన్ని ఉపయోగించనుంది. ఇందుకోసం తన మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.


గూగుల్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతోంది. యూజర్స్‌కి మెరుగైన సేవలు అందించేందుకు గూగుల్‌ మరోసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయాజాలాన్ని ఉపయోగించనుంది. ఇందుకోసం తన మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తూ యూజర్స్‌కి మెరుగైన సేవలందిస్తోన్న గూగుల్. తాజాగా ఆండ్రాయిడ్‌ ఐఓఎస్‌ యూజర్స్‌ కోసం గూగుల్ మ్యాప్స్‌లో కీలక అప్ డేట్ ఒకటి విడుదల చేయనుంది. ఇందులో భాగంగా ఏఐ పవర్డ్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా పెద్దగా మాల్స్, ఏయిర్ పోర్ట్స్, అలాగే రైల్వే స్టేషన్స్ లో మీరు ఎక్కడకు వెళ్లాలో లైవ్ వ్యూ చూపించనుంది. ఇంత కాలం మ్యాప్స్ లో కేవలం వీధుల, ఇళ్ల వరకూ పరిమితం అయ్యేవి. అయితే గూగుల్ ఇఫ్పుడు మరో ముందడుగు వేసింది. మీరు పబ్లిక్ స్థలాల్లో టైంవేస్ట్ చేసుకోకుండా ఈ కొత్త ఫీచర్ ద్వారా ఎక్కడకు వెళ్లాలో వెతుక్కోవాల్సిన పనిలేదు.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad