PM MODI SPEACH HIGHLIGHTS: లాక్ డౌన్ పెట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి

 లాక్ డౌన్ పెట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి.. ప్రధాని మోదీ పిలుపు. 

I urge the States to consider lockdowns only as the last option and focus creating on micro containment zones: PM Modi 


LOCKDOWN అనేది చివరి అస్త్రం గా మాత్రమే వాడదాం

ఎంత కష్టం వచ్చినా  ధైర్యం కోల్పోవద్దు 

ఆక్సిజన్  కోసం ప్రత్యేక రైలు..దేశ వ్యాప్తం గా  కొరత తీరుస్తుంది

మే 1 నుంచి 18 ఏళ్ళు దాటిన అందరికి టీకా   

లాక్ డౌన్ అనేది ఆఖరి అస్త్రంగానే చూడాలని ప్రధాని మోదీ అన్నారు. కరోనా నుంచి లాక్ డౌన్ విధించకుండా ఉండాలంటే కొన్ని నిబంధనలు పాటించాలని చెప్పారు. ఈ క్రమంలో దేశంలో ఉన్న యువత ముందుకు వచ్చి తమ తమ ప్రాంతాల్లో కమిటీలు ఏర్పాటు చేసుకుని కరోనా నిబంధనలు అందరూ పాటించేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు

కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల నుంచి దేశం బయటపడడానికి ఏమేం చేయాలో ప్రధానమంత్రి సూచించారు. ముఖ్యంగా లాక్ డౌన్ అనేది ఆఖరి అస్త్రంగానే చూడాలన్నారు. కరోనా నుంచి లాక్ డౌన్ విధించకుండా ఉండాలంటే కొన్ని నిబంధనలు పాటించాలని చెప్పారు. ఈ క్రమంలో దేశంలో ఉన్న యువత ముందుకు వచ్చి తమ తమ ప్రాంతాల్లో కమిటీలు ఏర్పాటు చేసుకుని కరోనా నిబంధనలు అందరూ పాటించేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

క‌రోనా మొద‌ట వ‌చ్చిన‌ప్పుడు అది ఏంటి? ఎలా ఎదుర్కోవాల‌ని అనే విషయంపై కూడా క్లారిటీ లేద‌న్న ప్ర‌ధాని.. ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయ‌న్నారు.. ప్ర‌పంచంలోనే ప్ర‌ఖ్యాతి గాంచిన ఔష‌ధ సంస్థ‌లు భార‌త్‌లో ఉన్నాయి. క‌రోనా రెండో ద‌శ‌లో ఔష‌ధాల కొర‌త లేదు. ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా టీకాలు వేస్తున్న దేశంగా మ‌న‌దేశం నిలిచింది.. ఫార్మా కంపెనీలు ఔష‌ధాల ఉత్ప‌త్తిని పెంచాయి.. ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌, సీనియ‌ర్ సిటిజ‌న్లకు టీకాల ప్ర‌క్రియ పూర్తి చేశామ‌ని.. ప్ర‌స్తుతం 45 ఏళ్లు నిండినివారికి వ్యాక్సినేష‌న్ కొన‌సాగుతుండ‌గా. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన అంద‌రికీ టీకాలు అందిస్తామ‌న్నారు.. ఇక‌, లాక్‌డౌన్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌ధాని మోడీ.. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు త‌ప్పితే ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావొద్దు అని.. లాక్ డౌన్ విధించే ప‌రిస్థితి తీసుకు రావొద్దు అని విజ్ఞ‌ప్తి చేశారు.. అయితే, క‌రోనాను నియంత్రించ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్‌ను చివ‌రి అస్త్రంగానే భావించాలి అని సూచించారు.. లాక్‌డౌన్ నుంచి దేశాన్ని కాపాడాలి అని దేశ ప్ర‌జ‌ల‌ను కోరారు ప్ర‌ధాని మోడీ. 

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad