SBI తగ్గింపు ఆఫర్స్.. వివరాలు ఇవే…!

 ఎస్బీఐ తగ్గింపు ఆఫర్లని తీసుకు వచ్చి గుడ్ న్యూస్ చెప్పింది. దేశీ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఎన్నో రకాల సేవలని అందిస్తున్న సంగతి తెలిసినదే. అయితే తాజాగా కస్టమర్స్ కోసం మరో బంపర్ ఆఫర్ ని తీసుకు రావడం జరిగింది. మరి దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ వున్నాయి. మరి పూర్తిగా ఇప్పుడే తెలుసుకోండి.


స్టేట్ బ్యాంక్ తాజాగా యోనో సూపర్ సేవింగ్ డేస్ పేరు తో తమ కస్టమర్స్ కి డిస్కౌంట్ ఆఫర్లని ఇస్తోంది. ఈ ఆఫర్స్ నేటి నుండే అందుబాటులో ఉన్నాయి. వీటిని కస్టమర్స్ వినియోగించుకుంటే మంచి లాభాలని పొందొచ్చు.

ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 7 వరకు ఈ ఆఫర్లు ఉంటాయి. కనుక ఎస్‌బీఐ యోనో సూపర్ సేవింగ్ డేస్ ‌లో భాగంగా కస్టమర్లు పలు బ్రాండ్ల పై తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. దీనితో మీకు చాల ఆదా అవుతుంది. ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా యోనో సూపర్ డేస్ సేవింగ్ ఆఫర్లు ప్రకటించింది. ఇక వీటి కోసం చూస్తే.. అమెజాన్‌లో షాపింగ్ చేస్తే 10 శాతం అదనపు క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు.

అలాగే అపోలోలో 25 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. ఎట్ హోమ్‌లో అదనంగా 12 శాతం తగ్గింపు ఉంది. ఈజీ మై ట్రిప్‌ లో టికెట్ల బుకింగ్‌ పై రూ.850 వరకు తగ్గింపు కూడా పొందొచ్చు. దేశీ విమానాలకు ఈ ఆఫర్ ని వినియోగించుకోవచ్చు. అలానే యోనో బుకింగ్స్‌ పై ఏకంగా 40 శాతం ఫ్లాట్ తగ్గింపు లభిస్తోంది. ఇలా మరెన్నో ఆఫర్స్ వున్నాయి చూడండి.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad