గుడ్‌న్యూస్ చెప్పిన SBI


ప్ర‌భుత్వ‌రంగ బ్యాంకింగ్ దిగ్గ‌జం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది.. క్రెడిట్ కార్డుల‌పై షాపింగ్ చేసి.. తక్కువ వడ్డీతో ఈఎంఐలుగా మార్చుకునే ఆఫ‌ర్ తీసుకొచ్చింది.. దీనిపై ప్రాసెసింగ్ ఫీజును సైతం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. ఖాతాదారులు తమ కొనుగోళ్లను అతి తక్కువ వడ్డీ రేటుతో ఈఎంఐలుగా మార్చుకోవ‌చ్చ‌ని.. ఈ సేవలను ఫ్లెక్సీపేగా అందిస్తున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించింది. అయితే ఈ ఆఫ‌ర్ ఈ ఏడాది మే 9వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండ‌నుంది.. దీనిని ఎంచుకున్న వినియోగ‌దారుల‌కు తక్కువ వడ్డీ రేట్లతో పాటు 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును కూడా మాఫీ చేస్తున్న‌ట్టు స్ప‌ష్టం చేసింది.. 

త‌న‌‌ క్రెడిట్ కార్డుల ద్వారా పెద్దమొత్తంలో చేసే కొనుగోళ్ల ఈఎంఐలను తక్కువ నెలలకు పరిమితం చేసేందుకు ఫ్లెక్సీపే ఆప్షన్‌ ఉపయోగపడనుంద‌ని ఎస్బీఐ తెలిపింది.. ట్రాన్సాక్షన్ జరిగిన 30 రోజుల్లోగా పెద్ద కొనుగోళ్లను ఫ్లెక్సీపే ఈఎంఐగా మార్చుకునే వీలుండ‌గా.. క్రెడిట్ కార్డుపై కనీసం రూ.500 కంటే ఎక్కువ మొత్తంలో చేసిన లావాదేవీని ఫ్లెక్సిపేగా మార్చుకునే వీలు క‌ల్పిస్తోంది.. అయితే కనీస బుకింగ్ మొత్తం రూ.2500గా ఉంటుంద‌ని తెలిపింది. ఇక‌, ఉదార‌ణ‌కు ఎస్బీఐ కార్డుపై రూ.1000 కొనుగోలు చేశారంటే.. 6 నెలల ఈఎంఐ పేమెంట్ ఆప్షన్ కింద రూ.177.5 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.. 12 నెలల పేమెంట్ ఆప్షన్‌లో రూ.93.5, 24 నెలలకు రూ.51.9 మాత్రమే ఈఎంఐ వ‌స్తుంది.. ప్రస్తుతం ఎస్బీఐ కార్డు హోల్డ‌ర్ల‌కు మాత్ర‌మే ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుంద‌ని పేర్కొంది ఎస్బీఐ. 

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad