గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు..మరణాలు.


India Corona Updates: దేశంలో కరోనా మహహ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక తాజాగా కూడా 4 లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు దాటేశాయి. గడిచిన 24 గంటల్లో 18,26,490 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 4,01,078 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకు దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2.18 కోట్లకు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 4187 మంది కరోనాతో మృతి చెందగా, ఇప్పటి వరకు మరణాల సంఖ్య 2,38,270కి చేరుకుంది. ఇక దేశంలో మరణాల రేటు 1.09 శాతం ఉంది.

ఇక కొత్త కేసులతో పాటు రికవరీ కేసుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. గడిచిన 24 గంటల్లో 3,18,609 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రివకరీల సంఖ్య 1.79కోట్లకు చేరగా, రివకరీ రేటు 81.95 శాతం ఉంది. ఇక క్రియాశిల కేసులు 37 లక్షలు దాటగా, ప్రస్తుతం 37,23,446 మంది చికిత్స పొందుతున్నారు. ఇక క్రియాశీల రేటు 16.96గా ఉంది. శుక్రవారం ఒక్క రోజు దేశంలో 22,97,257 మందికి కరోనా టీకాలు వేయగా, ఇప్పటి వరకు 16.73 కోట్ల మందికి కరోనా టీకా వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

*కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌*

🌻న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ రెండో వేవ్‌ తీవ్రరూపంలో వ్యాపిస్తోంది. కరోనా కట్టడి చర్యలు తీసుకుంటున్నా ఏమాత్రం ఫలితం ఉండడం లేదు. దీంతో విధిలేక చివరి అస్త్రంగా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధిస్తున్నాయి. కరోనా గొలుసు తెంపేందుకు లాక్‌డౌనే పరిష్కారమని రాష్ట్రాలు భావిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఏకంగా 14 రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. మొదట మహారాష్ట్రతో మొదలైన లాక్‌డౌన్‌ అనంతరం ఢిల్లీ, కర్నాటక విధించగా తాజాగా తమిళనాడు కూడా విధించింది. ఈ విధంగా మొత్తం 14 రాష్ట్రాల్లో ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. ఏయే రాష్ట్రాల్లో తెలుసుకోండి.

*కేరళ*: ఈనెల 16వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

*ఢిల్లీ*: 10వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. పొడగించే అవకాశం ఉంది.

*మధ్యప్రదేశ్‌*: ఈనెల 15 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమల్లో ఉంది.

*ఉత్తరప్రదేశ్‌*: ఈనెల 10 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుంది

*హిమాచల్‌ప్రదేశ్‌*: ఈనెల 16 వరకు కొనసాగనున్న లాక్‌డౌన్‌.

*తమిళనాడు*: మే 10 నుంచి 24వ తేదీ వరకు లాక్‌డౌన్‌

*కర్ణాటక*: ఈనెల 10 నుంచి 24వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌

*రాజస్థాన్‌*: ఈనెల 10 నుంచి 24 వరకు లాక్‌డౌన్‌

*మహారాష్ట్ర*: ఏప్రిల్‌ 5న కర్ఫ్యూ లాంటి లాక్‌డౌన్, నిషేధ ఉత్తర్వులతో ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. నిషేదాజ్ఞలు మే 15 వరకు పొడిగించారు.  

*బిహార్‌*: మే 4 నుంచి 15 వరకు లాక్‌డౌన్‌

*చండీగఢ్‌*: వారం రోజుల లాక్‌ డౌన్‌ 

*గోవా*: మే 9 నుంచి 23 వరకు..

*హరియాణా*: మే 3 నుంచి మొత్తం వారం రోజుల పాటు 10వ తేదీ వరకు.

*మణిపూర్*: మే 7 వరకు లాక్డౌన్

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad