వచ్చే 72 గంటలు .. అని భయపెడుతున్న మెసేజ్.. అసలు నిజం ఎంత

వాట్సప్ వాడకం పెరిగాక ప్రజలను fake మెస్సేజులు బాగా భయపెడుతున్నాయి. ఏది అసలో.. ఏది FAKE  తెలుసుకోలేని జనం 

ఈ మెస్సేజులు చదివి భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాంటి దే ఓ మెస్సేజ్ వాట్సాస్లో బాగా సర్క్యులేట్ అవుతోంది. భారత్లో త్వరలోనే కరోనా మూడో వేవ్ రావచ్చని ప్రధాని సాంకేతిక సలహాదారు విజయ రాఘవన్ చెప్పిన తర్వాత ఈ థర్డ్ వేవ్ కేంద్రంగా మెస్సేజాలు బాగా పెరిగాయి. వాటిలో చాలా వరకూ తప్పుడు Messages  లే 

తాజగా అలాంటిదే ఓ ఫేక్ మెస్సేజ్ బాగా సర్క్యులేట్ అవుతోంది. వచ్చే 72 గంటలు భారత దేశానికి చాలా ప్రమాదకరమని WHO ICMR భారతదేశాన్ని హెచ్చరించిందన్నది ఆ మెస్సేజ్ సారాంకు. అంతే కాదు.. వచ్చే 78 గంటల్లో భారతదేశంలో ధర్డ్ వేవ్ ప్రారంభం అవుతోందని.. WHOతెలిపిందట . భారతదేశం మూడో దశకు వెళితే రోజూ 50, 000 మంది చనిపోతారట. భారతదేశ జనాభా సాంద్రత ఇతర దేశాల కంటే చాలా ఎక్కువ కావడమే ఇందుకు కారణమట

భారత్లో ధర్డ్ వేవ్ రాకుండా ఉండాలంటే జనం 72 నుండి 108 గంటలు అప్పులు బయటకు రాకూడదట. నగరాల్లో ఆసుపత్రిలో చోటు లేదని డబ్బు కూడా అప్పులు పనిచేయడం లేదని, ఏకైక పరిష్కారం మిమ్మల్ని మీరు మాత్రమే రక్షించుకోవడం అంటూ ఈ ఫేక్ మెస్సేజ్లో ఊదరగొడుతున్నారు. అయితే ఇది ఓ ఫేక్ మెస్సేజ్.. ఎందుకంటే అసలు WHO ICMR అనే సంస్థ లేదు. WHO వేరు ICMR వేరు.. ఈ ఫేక్ మెస్సేజ్ తయారు చేసిన వాడు ఈ రెండింటి పేర్లూ వాడేసుకున్నాడు.

Source : ఇండియా హెరాల్డ్ గ్రూప్

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad