Baba Ramdev : రాందేవ్ బాబా మీద 1000 కోట్ల పరువు నష్టం దావా...

Baba Ramdev : అల్లోపతి వైద్యంపై బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు..సోషల్ మీడియా తిరుగున్న విడీయోపై ఉత్తరాఖండ్ వైద్యులు తీవ్ర చర్యలు చేపట్టారు..రాందేవ్ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పడంతో పాటు వెయ్యికోట్ల పరువు నష్టం దావా నోటీసును పంపారు.

IMA Uttarakhand sends a defamation notice of Rs 1000 cr to Yog Guru Ramdev. The notice states that if he doesn't post a video countering the statements given by him and tender a written apology within the next 15 days, then a sum of Rs 1000 crores will be demanded from him

అల్లోప‌తి వైద్యం కరోనాను నియంత్రించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పై ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్(IMA) ఉత్త‌రాఖండ్ శాఖ రూ. వెయ్యి కోట్ల ప‌రువు న‌ష్టం దావా వేసింది. అల్లోపతి వైద్యంపై బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలకు 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా రాందేవ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే 1000 కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించాలని నోటిసులు పంపింది.

క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో అల్లోప‌తి వైద్యంపై తాను చేసిన ప్ర‌క‌ట‌న‌ల‌పై క్ష‌మాప‌ణ కోరుతూ వీడియోను పోస్టు చేయ‌క‌పోయినా, రాబోయే 15 రోజుల్లో రాత‌పూర్వ‌కంగా క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోయినా, రాందేవ్ బాబా రూ. 1000 కోట్ల ప‌రువు న‌ష్టం చెల్లించాల‌ని ఐఎంఏ ఉత్త‌రాఖండ్ శాఖ త‌మ ప‌రువు న‌ష్టం దావా నోటీసులో పేర్కొంది. రాందేవ్ బాబాపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి తీర్థ‌సింగ్ రావ‌త్‌కు కూడా ఐఎంఏ ఉత్త‌రాఖండ్ శాఖ లేఖ రాసింది.

మరోవైపు రాందేవ్‌పై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేస్తామని ఐఎంఏ హెచ్చరించింది. దీంతో తన వ్యాఖ్యలపై బాబా రాందేవ్ వెనక్కి తగ్గారు. అల్లోపతి వైద్యంపై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. అదే సమయంలో అల్లోపతి డాక్టర్లు సమాధానం చెప్పాలంటూ.. 25 ప్రశ్నలను కూడ సంధించారు. దీనిపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. షుగర్, బీపీ లాంటీ వాటికి అల్లోపతిలో వైద్యం ఉందా..గుండెకు నొప్పిలేకుండా ఆపరేషన్ చేయగలరా లాంటీ పలు ప్రశ్నలను ఆయన అల్లోపతి వైద్యులకు సంధించారు..

కాగా ఇప్పటికే ఈ వివాదంపై ట్వీట్ ద్వారా చెప్పిన క్షమాపణ సరిపోదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అందోళన వ్యక్తం చేస్తుంటే...ప్రస్తుతం ఇలాంటీ ప్రశ్నల ద్వార విషయాన్ని మరింత హీట్ ఎక్కించారు బాబా రాందేవ్..మొత్తం మీద బాబా రాందేవ్ వ్యాఖ్యలతో అటు అల్లోపతి ఇటు ఆయుర్వేదంపై చర్చ తీవ్ర స్థాయిలో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad