Bill and Melinda Gates’ Daughter Opens up on Parents' Divorce in Viral Instagram Post .25-year-old Jennifer Gates took to Instagram and posted a story soon after the viral announcement of parents Bill and Melinda Gates' divorce.
వాషింగ్టన్: ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సంచలన ప్రకటన చేశారు. మిలిందా గేట్స్‌తో వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించారు. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని, అయితే సామాజిక కార్యక్రమాల్లో మాత్రం భాగస్వాములుగానే కొనసాగుతామని స్పష్టం చేశారు. బాగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సతీమణి మిలిందా గేట్స్‌తో కలిసి ట్విటర్ వేదికగా సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
27 ఏళ్ల బంధం ఇక ముగిసింది..
సంపదలో కుబేరులు.. మానవత్వంలోనూ
బ్లూమ్‌బర్గ్ తాజా నివేదిక ప్రకారం బిల్ గేట్స్ సంపద ప్రస్తుతం 124 బిలియన్ డాలర్లు. కాగా 1970లో ప్రారంభమైన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు అయిన ఆయన.. 1987లో తొలిసారిగా ప్రపంచ సంపన్నుడిగా ఫోర్బ్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. 24 ఏళ్ల పాటు అదే స్థానంలో కొనసాగారు. ప్రస్తుతం బిల్‌గేట్స్ అత్యంత ధనవంతుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు.
ఇక 1987లో మైక్రోసాఫ్ట్‌లో ప్రొడక్ట్ మేనేజర్‌గా జాయిన్ అయిన మిలిందా, అదే ఏడాదిలో ఓ డిన్నర్ పార్టీలో బిల్ గేట్స్‌ను కలిశారు. ఈ క్రమంలో డేటింగ్ ప్రారంభించిన ఈ జంట.. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని 1994లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
ఫౌండేషన్ స్థాపించి..
గేట్స్ దంపతులు 2000లో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ స్థాపించి సామాజిక సేవలో భాగమయ్యారు. ప్రధానంగా ప్రజారోగ్యం, విద్య తదితర అంశాలపై దృష్టి సారించి ఎంతో మందికి సాయం చేశారు. పర్యావరణ పరిరక్షణ, లింగ సమానత్వం, మహిళా సాధికారికతకై తమ వంతు కృషి చేశారు. అంతేకాదు కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధికై ఈ ఫౌండేషన్ 1.75 బిలియన్ డాలర్ల గ్రాంట్లు విడుదల చేసింది. తద్వారా వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది.