సింగపూర్ లో కొత్త స్ట్రెయిన్ గురించి కేజ్రీ వాల్ చేసిన ప్రకటన.. రెండు ప్రభుత్వాల స్పందన

Delhi Chief Minister Arvind Kejriwal
సింగపూర్ లో కొత్త స్ట్రెయిన్ ఉందంటూ, అది భారతదేశంలోకి ప్రవేశించి థర్డ్ వేవ్ ని సృష్టించే అవకాశం .ఉన్నందున సింగపూర్ నుండి వచ్చే విమానాలపై వెంటనే నిషేధం విధించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిన్న సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్న విషయంపై ఇటు భారత ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించాయి...

అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే సింగపూర్ లోని భారత హై కమీషనర్ ని సింగపూర్ ప్రభుత్వం పిలిపించి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతే కాకుండా సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ నిజాలు తెలుసుకొని మాట్లాడాలని ట్విట్టర్ వేదికగా అరవింద్ కేజ్రీవాల్ కి హితవు పలికారు.

కేజ్రీవాల్ వ్యాఖ్యలు భారత ప్రభుత్వ వైఖరి కాదని, సింగపూర్ భారత్ కి ఈ కరోనా కష్టకాలంలో తోడుగా నిలిచిందని ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన సింగపూర్ విదేశాంగ మంత్రికి ట్విట్టర్ ద్వారా తెలియజేసారు కూడా. భారత్, సింగపూర్ దేశాల మధ్య స్నేహం ఇలానే కొనసాగాలని ఆయన కోరడంతో, అది ధృడంగా కొనసాగుతుందని సింగపూర్ విదేశాంగ మంత్రి స్పందించారు.

ఈ విషయంపై ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి చురకలు అంటించారు. తమ పరిపాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేసి మిత్ర దేశాలతో వైరం తెచ్చేలా ప్రవర్తించడం సరికాదని అన్నారు

తమ లోపాలను కప్పిపుచ్చి, ప్రజల దృష్టికి మరల్చడానికి రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ ల మధ్య పోరు నడుస్తుందని, ఇది దానికి సాక్ష్యం అని వ్యాఖ్యానించారు రాజీవ్ చంద్రశేఖర్.

అరవింద్ కేజ్రీవాల్‌కి సింగపూర్ వార్నింగ్

న్యూ ఢిల్లీ : సింగపూర్‌లో ప్రస్తుతం కరోనావైరస్‌కి చెందిన కొత్త స్ట్రెయిన్ వ్యాపిస్తోందని, అది చాలా డేంజరస్ వైరస్ అని, చిన్నారులపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సింగపూర్‌లో వేగంగా వ్యాపిస్తున్న ఈ కొత్త స్ట్రెయిన్ వల్ల భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ రావొచ్చని భారత ప్రభుత్వాన్ని హెచ్చరించిన కేజ్రీవాల్.. భారత్ - సింగపూర్ మధ్య విమానాల రాకపోకలు నిలిపేయాల్సిన అవసరం ఉందని సూచించారు. సరిగ్గా ఇదే విషయమై భారత్‌లో ఉన్న సింగపూర్ హై కమిషనర్ సైమన్ వాంగ్ తీవ్రంగా స్పందించారు. 

సింగపూర్‌లో కొత్త స్ట్రెయిన్ అనేది ఓ ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసిన సైమన్ వాంగ్.. సింగపూర్‌లో ఇలా ఫేక్ న్యూస్ వైరల్ చేసే వారిపై కేసు నమోదు చేసి శిక్ష విధించేందుకు 'ప్రొటెక్షన్ ఫ్రమ్ ఆన్‌లైన్ ఫాల్స్‌హుడ్ అండ్ మ్యానిపులేషన్ యాక్ట్' (Protection from Online Falsehoods and Manipulation Act) అని ఓ చట్టం ఉందని, ఆ చట్టం ప్రకారం అరవింద్ కేజ్రీవాల్‌పై కూడా కేసు నమోదు చేసే హక్కు సింగపూర్‌కి ఉంటుందని సైమన్ వాంగ్ హెచ్చరించారు.

Let's take a look at who said what on the ongoing controversy:

Terming the comments "irresponsible", India's foreign minister S Jaishankar wrote on Twitter: "Singapore and India have been solid partners in the fight against Covid-19. Appreciate Singapore's role as a logistics hub and oxygen supplier. Their gesture of deploying military aircraft to help us speaks of our exceptional relationship."

"However, irresponsible comments from those who should know better can damage long-standing partnerships. So, let me clarify - Delhi CM does not speak for India," Jaishankar added.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad