CARONA టైంలో మన ఆరోగ్యాన్ని కాపాడేవి ఇవే!


ఎండాకాలం మనం త్వరగా అలసిపోతాం. కానీ మనకు ఎండాకాలమే మంచిది. ఎందుకంటే చలికాలంలో అడ్డమైన వైరస్‌లు, క్రిములూ బాగా పెరుగుతాయి. ఇది వాటికి పండగ సీజన్ అనుకోవచ్చు. అందుకే ఈ కాలంలో చాలా మందికి జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ, కఫం వంటి రకరకాల సమస్యలు ఉంటాయి. వీటికి ఇప్పడు కరోనా కూడా తోడైంది. పొరపాటున ఏ జలుబో, దగ్గో వస్తే లేని పోని టెన్షన్లు. అందుకే అసలు అవి రాకుండా చేసుకోవడం మేలు. దాని కోసం సింపుల్ చిట్కాలున్నాయి.

అల్లం జ్యూస్: అల్లంని సన్నగా స్లైసెస్‌లా కట్ చేసి జ్యూస్ తియ్యండి. అందులో కొన్ని తులసి ఆకుల రసం వెయ్యండి. దాన్ని తాగేయండి. చేదుగా అనిపిస్తే కొద్దిగా తేనె కలుపుకోండి.

చాలా మంది రాత్రివేళ పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగుతారు. ఆ అలవాటు మీకు లేకపోతే ఇకపై ప్రారంభించండి. పసుపు కలిపిన పాలలో నాలుగుకు మించకుండా బాదం పప్పులను కూడా వేసుకోవచ్చు. ఇది చాలు దగ్గు, జలుబు రెండూ పరార్.

డికాక్షన్ కూడా జలుబు, దగ్గు అంతుచూస్తుంది. ఓ గ్లాస్ వాటర్ వేడి చెయ్యండి. నీరు ఉడుకుతున్నప్పుడు ఓ రెండు లవంగాలు, నాలుగు మిరియాలు, ఓ యాలిక, ఓ చిన్న అల్లం ముక్క, కొద్దిగా బెల్లం వెయ్యండి. మీడియం ప్లేమ్‌లో ఉడకనివ్వండి. మధ్యలో అటూ ఇటూ కదుపుతూ ఉండండి. నీరు సగానికి తగ్గగానే తులసి ఆకులు నాలుగు వెయ్యండి. కొద్దిగా టీపొడి వెయ్యండి. మరో నిమిషం ఉడికితే చాలు. ఫిల్టర్ చేసి ఆ డికాక్షన్ తాగారంటే గొంతులో, ముక్కులో ఉన్న వైరస్‌లన్నీ గిలగిలా కొట్టుకుంటూ చస్తాయి. ఇక మందులతో పనేముంది.

నీటిలో మిరియాల పొడి (లేదా మిరియాలు), జీలకర్ర, బెల్లం వేసి ఉడికించండి. ఫిల్టర్ చేసి తాగండి. రోజూ ఇలా తాగారంటే జలుబు, దగ్గు, గొంతులో కఫం కూడా పోతుంది.

రోజూ టీ తాగుతారు కదా అందులో అల్లం ముక్క కూడా వేసి ఉడికించండి. అల్లం టేస్ట్ అదిరిపోతుంది. బాడీకి కూడా ఎంతో మేలు. దగ్గు నుంచి అల్లం కాపాడుతుంది.

దాహంగా ఉన్న ప్రతిసారీ గోరు వెచ్చటి నీరు తాగే అలవాటు చేసుకోండి. ఫ్రిజ్ వైపు చూడకండి. గోరు వెచ్చటి నీరు ఎంత మంచిదంటే అది దగ్గు, జలుబు, కఫం రాకుండా చేస్తుంది. గొంతులో మంటను తగ్గిస్తుంది. ఇలా చాలా ప్రయోజనాలున్నాయి.

వెల్లుల్లి కూడా దగ్గు, జలుబు, కఫంతో గట్టిగా పోరాడుతుంది. ఇందుకోసం ఓ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను నెయ్యిలో వేపండి. అవి కొద్దిగా రంగు మారేవరకూ వేపండి. ఇప్పడు వాటిని వేరే గిన్నెలో వేసి చల్లారనివ్వండి. ఆ తర్వాత బఠాణీలు నమిలినట్లు వాటిని నమిలేయండి. వెల్లుల్లి కాస్త చేదుగానే ఉంటుంది. కానీ దాని శక్తి మామూలుగా ఉండదు. చాలా త్వరగా జలుబు, దగ్గూ పారిపోతాయి. తిన్న తర్వాత చేదు పోవడానికి చిన్న బెల్లం ముక్క తినండి.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad