Corona Deaths : కరోనా రోగుల మరణానికి అసలు కారణం అదే..! కొత్త అధ్యయనంలో వెల్లడి..


Corona Deaths : కరోనా రోగుల మరణానికి అసలు కారణం అదే..! కొత్త అధ్యయనంలో వెల్లడి..Corona Deaths : కరోనా రోగుల మరణానికి అసలు కారణం అదే..! కొత్త అధ్యయనంలో వెల్లడి..

Corona Deaths : దేశంలో కరోనా కల్లోలానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. మానావాళి నుదుటి మీద కరోనా రాస్తున్న మృత్యుశాసనానికి బ్రేక్ పడటం లేదు. అయితే, కరోనా వల్ల ఇంత మంది చనిపోవడానికి కారణమెంటో పరిశోధకులు కనుగొన్నారు. ఆ విషయాలు ఏంటంటే..

కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. దీని బారిన పడి చాలా మంది కోలుకుంటుండగా.. కొందరు మాత్రం మరణిస్తున్నారు. అయితే, వైరస్ వేరియంట్ ఒకటే అయినప్పటికీ దీని ప్రభావం మనుషుల్లో భిన్నంగా ఉండటంపై హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. కరోనా రోగుల మరణానికి కారణమయ్యే యంత్రాంగాలను గుర్తించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మనిషి రక్తంలోని ప్రోటీన్ సిగ్నేచర్స్‌ను పరిశీలించడం ద్వారా కరోనా రోగి శరీరంలో ఏం జరుగుతుందనే దానిపై ఒక అంచనాకు వచ్చారు. మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు కరోనా సోకినవారి శరీరంలో ప్రోటీన్ సిగ్రేచర్స్‌ను గుర్తించారు. ఈ ప్రోటీన్ కారణంగానే రోగులు మరణిస్తున్నారని ప్రాథమికంగా తేల్చారు. కొంతమంది రోగులు ఈ వ్యాధితో ఎందుకు చనిపోతున్నారు? మరికొందరు మహమ్మారి నుంచి ఎలా బయటపడుతున్నారు? అనే విషయంపై వారి అధ్యయనం కొనసాగింది.హార్వర్డ్ మెడికల్ స్కూల్ మెడిసిన్, బయోమెడికల్ రీసెర్చ్, మెడికల్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలు సెల్ రిపోర్ట్స్ మెడిసిన్లో ప్రచురించారు. ఈ అధ్యయనానికి ఫిల్బిన్, గోల్డ్‌బెగ్‌తో పాటు హెచ్‌ఎంఎస్ మెడిసిన్ ప్రొఫెసర్ నిర్ హాకోహెన్‌తో కలిసి పనిచేశారు. COVID-19 కు కారణమయ్యే వ్యాధికారక SARS-CoV-2పై మానవ రోగనిరోధక వ్యవస్థ ఎలా స్పందిస్తుందో అర్థం చేసుకునే లక్ష్యంతో ఈ ముగ్గురి పరిశోధన కొనసాగింది. అధ్యయనంలో భాగంగా శ్వాసకోశ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన కోవిడ్ పేషెంట్లను నుంచి రక్త నమూనాలను సేకరించి ప్రోటీమిక్ విశ్లేషణతో అధ్యయనం నిర్వహించారు.

306 కరోనా రోగులపై అధ్యయనం..

ఈ నమూనాలను సేకరించడానికి అనేక విభాగాల నుంచి పెద్ద సంఖ్యలో కరోనా పరిశోధకులు అవసరమయ్యారు. కరోనా సోకిన 306 మంది రోగుల నుంచి రక్త నమూనాలను సేకరించడానికి వారు దాదాపు ఐదు వారాల పాటు ఓవర్ టైం పనిచేశారు. ప్రోటీమిక్ విశ్లేషణ ద్వారా ఉత్పత్తి చేసిన సంక్లిష్ట డేటాను పర్యవేక్షించారు. రక్తంలో ప్రోటీన్ సిగ్నేచర్స్‌ను విశ్లేషించడం ద్వారా శరీరంలో ఏం జరుగుతుందనే విషయాన్ని పసిగట్టగలమని వీరు చెప్పారు. అందుకే తమ పరిశోధన రక్తంలోని ప్రోటీన్లపై కొనసాగిందన్నారు.

వ్యాధి తీవ్రతతో సంబంధం లేకుండా.. స్థిరమైన ప్రోటీన్ సిగ్నేచర్ కారణంగానే చాలా మంది కరోనా రోగులు మరణిస్తున్నారని వారు ప్రాథమికంగా తేల్చారు. ఊహించినట్లుగానే, వారి శరీరాలు వైరస్‌పై దాడి చేసే ప్రోటీన్లను ఉత్పత్తి చేయడం ద్వారా రోగనిరోధక శక్తి తగ్గి మరణిస్తున్నారని అధ్యయనంలో తేల్చిచెప్పింది. అంతేకాక, కంట్రోల్డ్‌‌ డయాబెటిస్ పేషెంట్లు, గుండె , కిడ్నీ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వ్యక్తులు, హెపటైటిస్‌‌ సమస్య ఉన్నవాళ్లలో సైటోకైన్స్ ఓవర్‌‌‌‌గా ఉత్పత్తి అవుతుండగా, ఏ జబ్బులు లేని వాళ్లలోనూ ఈ సమస్య ఏర్పడుతున్నట్టు గుర్తించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు.

Source

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad