Lunar Eclipse 2021: ఈరోజే సంపూర్ణ చంద్రగ్రహణం.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా చూడొచ్చు?

 అంతరిక్షంలో అద్భుతం జరుగబోతోంది. సంపూర్ణ చంద్ర గ్రహణం 2021, మే 26న బుధవారం కనువిందు చేయనుంది. ఈ చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్ అని పిలుస్తారు.


Lunar Eclipse 2021: అంతరిక్షంలో అద్భుతం జరుగబోతోంది. సంపూర్ణ చంద్ర గ్రహణం 2021, మే 26న బుధవారం కనువిందు చేయనుంది. ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా మొత్తం, ఓషియానియా, అలస్కా, కెనడా, అమెరికాలో ఎక్కువ భాగం హవాయి అన్ని ప్రాంతాలలో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది.

మెక్సికో, మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలో చాలా భాగం భారతదేశంలోనూ ఈ చంద్ర గ్రహణం బాగా కనిపిస్తుంది. దేశంలోని ఈశాన్య ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప కాలం పాటు పాక్షికంగా కనిపిస్తుంది.

ఈ చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్ (Blood Moon)అని పిలుస్తారు. చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు ఎరుపు, నారింజ రంగుల్లో కనిపిస్తాడు. సూర్యకిరణాల్లోని ఎరుపు, నారింజ రంగుతో కిరణాలు భూమిమీద పడతాయి. అలా వచ్చిన కాంతి కిరణాలు చంద్రునిపై పడతాయి. అప్పుడు చంద్రుడి రంగు మారిపోతుంది. అప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణంగా మారుతుంది. 2019 జనవరి 21న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు వస్తోంది.

చంద్ర గ్రహణం తేదీ, సమయం ఏంటి?

సంపూర్ణ చంద్ర గ్రహణం లేదా చంద్ర గ్రహన్ మే 26 బుధవారం జరుగుతుంది. జనవరి 2019 చంద్ర గ్రహణం తరువాత మొదటి సంపూర్ణ చంద్ర గ్రహణం. పెనంబ్రల్ ఎక్లిప్స్ వద్ద మే 26న ఉదయం 08:47:39 (UTC)కు మొదలై.. 13:49:44 (UTC) వద్ద ముగుస్తుంది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad