Remdesivir: రెమిడెసివర్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన నిర్ణయం.. క్లారిటీ వచ్చినట్టేనా..

దేశంలోని కరోనా బాధితుల చికిత్సలో అత్యంత కీలకంగా మారిన రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక నిర్ణయం తీసుకుంది. రెమ్‌డెసివర్‌ వల్ల కరోనా రోగులు కోలుకున్నట్లు ఆధారాలు లేవని డబ్ల్యుహెచ్‌వో స్పష్టం చేసింది.

కరోనా బాధితులకు ఇస్తున్న రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌పై తమకు అనుమానాలు ఉన్నాయని పేర్కొంది. ఈ కారణంగానే కరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివర్‌ను తొలగిస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. 


మరోవైపు రెమ్‌డెసివర్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ రకమైన నిర్ణయం తీసుకోవడానికి ముందే.. ఈ ఔషధంపై భారత్‌లోనూ సందేహాలు వ్యక్తమయ్యాయి. దేశంలోని పలువురు వైద్య నిపుణులు సైతం కరోనా చికిత్స విధానం నుంచి రెమ్‌డెసివర్‌ను తప్పించాలనే వాదన వినిపించారు. అయితే దేశంలో, పలు రాష్ట్రాల్లో రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల బ్లాక్‌ మార్కెట్‌ దందా జోరుగా నడుస్తోంది. కొందరు బ్లాక్ మార్కెట్‌లో ఈ ఇంజక్షన్లను అధిక ధరకు అమ్ముతుంటే.. మరికొందరు నకిలీ రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లను తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad