45 ఏళ్ళు దాటిన వారికే VACCINATION .. స్ప‌ష్టం చేసిన CABINET..!



దేశ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ కొర‌త వెంటాడుతూనే ఉంది.. ఈ నెల 1వ తేదీ నుంచి 18 నుంచి 45 ఏళ్ల మ‌ధ్య‌వారికి వ్య‌క్సినేష‌న్ చేప‌ట్టాల్సి ఉన్నా.. వ్యాక్సిన్ నిండుకోవ‌డంతో.. చాలా రాష్ట్రాలు వెనుక‌డుగు వేశాయి.. కొన్ని రాష్ట్రాల్లో ముందుకు వ‌చ్చినా.. అదికూడా ప‌రిమితంగా కొన్ని జిల్లాల్లో మాత్ర‌మే ఇస్తున్నాయి.. అయితే, ఇవాళ సీఎం వైఎస్ జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో.. 45 ఏళ్లు పైబ‌డిన‌వారికే వ్యాక్సిన్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.. ఇక‌, వాక్సినేషన్ల‌పై ప్రధాని న‌రేంద్ర‌ మోడీకి లేఖ రాయాలని నిర్ణ‌యించింది కేబినెట్.. ప్రధానికి వాక్సిన్ డోసులను త్వరగా కేటాయించాలని సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ‌రాయ‌నున్నారు.. 

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో 45 ఏళ్ళు పైబడిన వారికి వాక్సినేషన్ లో ప్రాధాన్యం ఇవ్వాలి స్ప‌ష్టం చేసారు సీఎం వైఎస్ జ‌గ‌న్.. ఇక‌, ఆక్సిజన్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.. కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు నుండి రప్పించేందుకు చర్యలు తీసుకోవాల‌న్న సీఎం.. ఆక్సిజన్ కొరత పై సుదీర్ఘంగా చ‌ర్చించారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 450 మిలియన్ టన్నుల ఆక్సిజన్ డిమాండ్ ఉంద‌న్నారు.. సింగపూర్ నుంచి 20 ఆక్సిజన్ ట్యాంకర్లను కొనుగోలు చేయాలని కేబినెట్ నిర్ణ‌యించింది.. మ‌రోవైపు.. రేపటి నుండి డై టైం , నైట్ టైం కర్ఫ్యూ ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణ‌యం తీసుకున్నారు.. దీంతో.. ఆర్టీసీ బస్సులను కూడా మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కే న‌డ‌ప‌నున్నారు.. దీంతో.. ప్ర‌జ‌లు త‌మ ప్ర‌యాణాల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా ప్లాన్ చేసుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చింది 

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad