ఉపాధ్యాయ సంఘాలతో విద్యా శాఖ మంత్రి webex మీటింగ్ విశేషాలు

(24/05/2021) సాయంత్రం నాలుగు గంటలకు ఉపాధ్యాయ సంఘాలతో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ గారు వెబెక్స్  ద్వారా వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించడం జరిగింది.*

ఈ సమావేశంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్ గారు, కమిషనర్ శ్రీ వి. చిన వీరభద్రుడు గారు,  ఎస్ పి డి శ్రీమతి వెట్రిసెల్వి గారు మరియు ఇతర ఉన్నతాధికారులతో పాటుగా గుర్తింపు పొందిన  ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నాయి

 ఈ సమావేశంలో విద్యారంగంలో కొనసాగుతున్న సమస్యలను ప్రస్తావించటం జరిగింది ముఖ్యంగా :

*❇️ ప్రస్తుత పరిస్థితులలో పరీక్షలను వాయిదా వేయాలనీ, పాఠశాలల పునఃప్రారంభం ను కూడా వాయిదా వేయాలని   కోరడమైనది.*

*❇️నాడు నేడు లో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఇంతవరకు ఆర్థిక సెలవులను మంజూరు చేయలేదని కోరగా కమిషనర్ గారు ఒక వారం రోజులలోనే ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు.*

❇️ఉపాధ్యాయులందరినీ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి అందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి అయిన తరువాత మాత్రమే పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని కోరడమైనది.

❇️కోవిడ్ తో మరణించిన ఉపాధ్యాయులకు వెంటనే ఎక్స్ గ్రే షియా చెల్లించాలనీ,

వారి యొక్క పెన్షన్ తదితర సదుపాయాలను వెంటనే అందజేయాలనీ,

మరియు వారి కుటుంబంలోని వారికి వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలనీ కోరడమైనది.

❇️ కోవిడ్ బారిన పడిన ఉపాధ్యాయులకు ప్రత్యేక సెలవులు మంజూరు కోరడమైనది. 

❇️విద్యాబోధనకు ఆటంకపరిచే యాప్ ల భారంను తగ్గించాలనీ కోరగా, పాఠశాలల పునః ప్రారంభం నాటికి కనెక్టివిటీని పెంచి దీనిలో ఉన్న ఇబ్బందులను పూర్తిగా తొలగిస్తామని హామీ ఇవ్వడమైనది.

❇️నాడు నేడు రెండో విడత లో భాగంగా ఉపాధ్యాయులకు భారం తగ్గించాలని కోరగా, సచివాలయ సిబ్బంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో పని భారాన్ని పంచుతామని తెలిపారు.

❇️సర్వీస్ రూల్స్ కు శాశ్వత పరిష్కారం త్వరితగతిన తీసుకురావాలని...

❇️ జె ఎల్  ప్రమోషన్ లను చేపట్టాలనీ..

❇️శాశ్వత బదిలీ కోడ్ అమలు చేయాలనీ..

❇️వెంటనే డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలనీ కోరగా, డీఎస్సీ నిర్వహించి 8600 ఏకోపాధ్యాయ పాఠశాలలకు ఉపాధ్యాయులను అందిస్తామని తెలిపారు.

❇️ఎయిడెడ్ పాఠశాలల విలీన ప్రక్రియలను వెంటనే చేపట్టాలని కోరడమైనది.

❇️ఇటీవల జరిగిన బదిలీలలో కోర్టు కేసుల కారణంగా బదిలీలు పొందని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ కోరగా, జూన్ 15 నుండి 30 వరకు వారికి కౌన్సిలింగ్ నిర్వహించమని తెలిపి ఉన్నారు కావున ఆ కార్యాచరణను చేపడతామని తెలిపారు.

❇️పాఠశాలల పునర్విభజనలో భాగంగా బదిలీ పొందిన ఉపాధ్యాయులకు నాన్ హెచ్ ఆర్ ఎం ఎస్ ద్వారానే జీతాలు చెల్లిస్తున్నారనీ, వెంటనే వారికి పొజిషన్ ఐ డి లు వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరడమైనది.

❇️40 మంది విద్యార్థుల సంఖ్య దాటిన ప్రాధమిక పాఠశాలలకు  హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలనీ,

❇️ అంతర్ జిల్లా బదిలీలు,

అంతరాష్ట్ర బదిలీలు  చేపట్టాలనీ,

నెల వారి పదోన్నతులు చేపట్టాలని,

610 జీవో  ద్వారా కొనసాగుతున్న ఉపాధ్యాయులకు బదిలీలు మరియు పదోన్నతులలో అవకాశం కల్పించాలని కోరడమైనది.

❇️ఇంకనూ పలురకాల విద్యారంగ, పాఠశాలల సమస్యలను మంత్రివర్యులు మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వాటన్నిటిపై సానుకూలంగా స్పందించి త్వరలో నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి వర్యులు మరియు అధికారులు తెలపడమైనది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad