AP లో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు


అమరావతి: PA లో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలించారు. ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు కర్ఫ్యూ సడలిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయాలు వర్తించనున్నాయి. కొవిడ్‌ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువ ఉన్న జిల్లాల్లో సడలిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొంది. 

AP లో రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు మూసివేయనున్నారు. 8 జిల్లాల్లో రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఆంక్షలు సడలించారు. ఇక ఉభయగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం యథావిధిగా కొనసాగనున్నాయి. 


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad