జాతీయ విద్యావిధానం 2020
ఉపోద్ఘాతం
సంపూర్ణ మానవ సామర్థ్యాన్ని సాధించేందుకు, నిష్పాక్షికమైన, న్యాయబద్ధమైన సమాజాన్ని స్థాపించేందుకు, జాతీయ అభివృద్దిని ముందుకు తీసుకెళ్లేందుకు విద్య మౌలికమైనది. భారతదేశ నిరంతర ప్రగతికి, అలాగే ఆర్ధికాభివృద్ధి, సామాజిక న్యాయం, సమానత్వం, వైజ్ఞానిక ఉన్నతి, జాతీయ సమైక్యత, సంస్కృతి పరిరక్షణల రీత్యా ప్రపంచ వేదిక మీద నాయకత్వం వహించేందుకు గాను నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో వుండేలా చూడటం చాలా ముఖ్యమైన అంశం. వ్యక్తి, సమాజ, దేశ, ప్రపంచ శ్రేయస్సు కోసం మన దేశ సుసంపన్న సామర్థ్యాలను: వనరులను అభివృద్ధిపరచుకుంటూ ముందుకువెళ్లేందుకు విశ్వజనీన, సర్వశ్రేష్ట విద్యే ఉత్తమమైన మార్గం. వచ్చే దశాబ్దం నాటికి భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా వున్న దేశంగా మారుతుంది. వారికి అత్యంత నాణ్యమైన విద్యావకాశాలు కల్పించడం మన దేశ భవిష్యత్తును నిర్దేశిస్తుంది..
నిరంతర అభివృద్ధి కోసం భారతదేశం 2015లో రూపొందించుకున్న 2030 ఎజెండా లక్ష్యం-4 ( ఎజి4)లో ప్రపంచ విద్యాభివృద్ధి ఎజెండా ప్రతిబింబించింది. 2030 నాటికి సమ్మిళిత, నిష్పాక్షిక నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడం, అందరికీ జీవితపర్యంతం నేర్చుకునే అవకాశాలను కల్పించడం దీని ఉద్దేశం. నేర్చుకోవడానికి మద్దతును ప్రోత్సాహాన్ని అందించే మహత్తరమైన ధ్యేయాన్ని సాధించేందుకు గాను మొత్తం విద్యా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి. తద్వారా 2030 ఎజెండాలోని సంక్లిష్టమైన టార్గెట్లను, లక్ష్యాలను, నిలకడతో కూడిన అభివృద్ధి లక్ష్యాలను (సనబుల్ డెవెలప్మెంట్ గోల్- ఎస్.డి.జి.) సాధించవచ్చు
DOWNLOAD BOOK