New Covid Sensor: కొత్త కోవిడ్‌ సెన్సార్‌.. వాసన ద్వారా కోవిడ్‌ సోకిన వారిని గుర్తింపు.


New Covid Sensor: కరోనా మహమ్మారి వల్ల ఎందరో బలవుతున్నారు. కంటికి కనిపించని వైరస్‌తో మానవుడు పోరాడుతున్నారు. కరోనా కట్టడకి ఒక వైపు వ్యాక్సినేషన్‌, లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతుంటే మరో వైపు కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఫస్ట్‌వేవ్‌ కంటే సెకండ్‌వేవ్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అయితే ఇక థర్డ్‌వేవ్‌ కూడా పిల్లలపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని ఇప్పటికే పరిశోధకులు వెల్లడించిన విషయం తెలిసిందే. కరోనాపై రకరకాల పరిశోధనలు కొనసాగిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తల బృందం కోవిడ్‌ సెన్సార్‌ను అభివృద్ధి చేశారు. ఇది ఒక గదిలో ఎవరైనా 15 నిమిషాల వ్యవధిలో కరోనా వైరస్‌ బారిన పడ్డారా లేదా అనే విషయాన్ని ఈ సెన్సార్‌ గుర్తిస్తుంది. విమానం క్యాబిన్‌లు, కేర్‌ హోమ్స్‌, తరగతి గదులు, కార్యాలయాలలో దీనిని అమర్చినట్లయితే ఎంతగానే ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. కేంబ్రిడ్జ్‌షైర్ ఆధారిత సంస్థ రోబో సైంటిఫిక్‌ చేత సృష్టించబడిన ఈ పరికరం కోవిడ్‌ సోకిన వారి వాసనను గుర్తిస్తుంది.

ఈ పరికరాన్ని మొదటగా లండన్‌లోని ఓ యూనివర్సిటీలో ఉంచి పరిశీలించారు. కరోనా సోకిన వ్యక్తుల వద్ద ఉండే స్నాక్స్‌ నుంచి, శరీర నమూనాలను ఉపయోగించి పరికరంతో పరీక్షించారు. 98 నుంచి 100 శాతం వైరస్‌ను గుర్తించగలిగింది. పీసీఆర్‌ పరీక్షల కంటే వేగంగా ఇది గుర్తించగలదని పరిశోధకులు తేల్చారు. అలాగే పరిశోధకులు 54 మందిపై ఈ పరీక్షలు ప్రయోగించగా, అందులో 27 మందికి కోవిడ్‌ సోకినట్లు తేల్చారు.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad