మీరు ఎస్‌బీఐ వినియోగదారులా? మీ మొబైల్ నంబర్‌ను మార్చడానికి ఇక బ్యాంకులకు వెళ్లాల్సిన పనిలేదు.హాయిగా ఇంట్లోనే కూర్చొ ని నంబర్‌ను యాడ్ చేయవచ్చు. వివరాలు తెలుసుకుందాం.
దీనికి కేవలం మీ వద్ద స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్, ల్యాప్‌టాప్ ఉంటే చాలు. సులువుగా మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయొచ్చు. మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసేప్పుడు మీ దగ్గర ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ కూడా ఉండాలి. వన్ టైమ్ పాస్‌వర్డ్ ద్వారా మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయొచ్చు.
ముందుగా ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ https://www.onlinesbi.com పై క్లిక్ చేయాలి.
అప్పుడు మీ వివరాలతో అకౌంట్‌లో లాగిన్ కావాలి.
⚾ ఎడమవైపు My Accounts and Profile పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత ఆ డ్రాప్‌డౌన్ మెనూలో Profile పైన క్లిక్ చేసి,
⚾ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ ప్రొఫైల్ పాస్‌వర్డ్ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.
⚾ మీరు లాగిన్ సమయంలో ఉపయోగించిన పాస్‌వర్డ్ కాదు.
మీరు గతంలో క్రియేట్ చేసిన ప్రొఫైల్ పాస్‌వర్డ్ నమోదు చేయాలి.
⚾ ఆ తర్వాత Change Mobile Number & Domestic only పైన క్లిక్ చేయాలి.
⚾ అప్పుడు కొత్త స్క్రీన్ పైన మీ వ్యక్తిగత వివరాలు–మొబైల్ నెంబర్ అప్‌డేట్ అని కనిపిస్తుంది.
⚾ ఆ తర్వాత మీ కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
⚾ మరోసారి కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
⚾ చివరగా సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.
⚾ మీ మొబైల్ నెంబర్ వెరిఫై చేయాలని పాప్ అప్ మెసేజ్ వస్తుంది. దాని పైన క్లిక్ చేయాలి.
⚾ తర్వాత ఓటీపీ, ఏటీఎం, కాంటాక్ట్ సెంటర్ అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి.
⚾ By OTP on both the Mobile Number అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.
⚾ మీ అకౌంట్ సెలెక్ట్ చేసి, ఏటీఎం కార్డు సెలెక్ట్ చేయాలి.
⚾ మీ ఏటీఎం కార్డు నెంబర్, వేలిడిటీ, కార్డ్ హోల్డర్ పేరు, పిన్ వివరాలు ఎంటర్ చేయాలి. అప్పుడు ఓటీపీ, రిఫరెన్స్ నెంబర్ మీ పాత మొబైల్ నెంబర్‌కు వస్తుంది.
⚾ ఆ తర్వాత ACTIVATE అని టైప్ చేసి 8 అంకెల ఓటీపీ టైప్ చేసి 13 అంకెల రిఫరెన్స్
⚾ నెంబర్ ఎంటర్ చేసి 567676 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపాలి.
⚾ ఈ ఫార్మాట్‌లో మీ రెండు మొబైల్ నెంబర్ల నుంచి 4 గంటల్లో ఎస్‌ఎంఎస్ పంపాలి.
⚾ మీ OTP వెరిఫై అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్ సక్సెస్‌ఫుల్‌గా అప్‌డేట్ అవుతుంది.