TENTH/INTER EXAMS: టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ఇప్పట్లో లేవ్‌!

టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ఇప్పట్లో లేవ్‌!

ప్రక్రియకు 40 రోజుల సమయం 

కరోనా తగ్గాకే సన్నద్ధతపై నిర్ణయం: విద్యా మంత్రి సురేశ్‌ వెల్లడి.


అమరావతి, జూన్‌ 11(ఆంధ్ర జ్యోతి): టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ఇప్పట్లో నిర్వహించే అవకాశం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ చెప్పారు. పరీక్షల ప్రక్రియకు సుమారు 40 రోజుల సమయం అవసరం ఉంటుందన్నారు. దీంతో పాటు విద్యార్థులు నీట్‌, జేఈఈ, ఎంసెట్‌ పరీక్షలకు హాజరయ్యేందుకు కూడా సమయం అవసరమవుతుందని, వీటిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుం టామని, ఇప్పట్లో పరీక్షలు నిర్వహించే అవకాశం లేదన్నారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా పూర్తిగా తగ్గాక విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని, వాటిపై సంతృప్తి చెందిన తర్వాత తల్లిదండ్రులకు ఆందోళన లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను ప్రకటిస్తామని మంత్రి వివరించారు. ఈ క్రమంలో వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుంటామన్నారు. కాగా, ఏపీ టెట్‌-21 పరీక్షకు సంబంధించిన సిలబ్‌సను సిద్ధం చేసినట్టు మంత్రి సురేశ్‌ చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని
http://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. 

ఎస్‌జీటీ పోస్టులు..

డీఎస్సీ-2008లో క్వాలిఫై అయిన 2,193 మంది అభ్యర్థులకు సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎ్‌సజీటీ) పోస్టులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి సురేశ్‌ తెలిపారు. వీరి కోసం స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ చేపడతామని తెలిపారు. వీరంతా మినిమమ్‌ టైం స్కేల్‌(ఎంటీఎస్‌) విధానంలో పనిచేసేందుకు రాత పూర్వకంగా అంగీకారం తెలిపారన్నారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా డీఎస్సీ-2008 అభ్యర్థులకు మాత్రమే వర్తించేలా ఎస్‌జీటీ పోస్టులు భర్తీ చేయాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వివరించారు. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని సీఎం జగన్‌ నిలబెట్టుకున్నారని మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించిన కోర్టు కేసులను పరిష్కరించారన్నారు. కోర్టు కేసుల నేపథ్యంలో ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న 486 పీఈటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తామని, ఇంకా పెండింగ్‌లో ఉన్న 374 పోస్టులను సైతం త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి సురేశ్‌ తెలిపారు

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad