Club house: డార్క్‌ వెబ్‌లో ఈ సోషల్‌మీడియా యూజర్ల డేటా అమ్మకం..!


గత కొన్ని రోజుల నుంచి బాగా ప్రాచుర్యం పొందిన సోషల్‌మీడియా యాప్‌ క్లబ్‌హౌజ్‌. ఈ యాప్‌తో  ఆడియో రూపంలో యూజర్లు తమ భావాలను ఇతరులతో పంచుకోవచ్చును. ఈ యాప్‌  తొలుత ఆపిల్‌ ఐవోఎస్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా క్లబ్‌హౌజ్‌పై సోషల్‌ మీడియాలో వస్తోన్న వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.  క్లబ్‌హౌజ్‌ యూజర్లకు చెందిన 3.8 బిలియన్ల ఫోన్‌ నంబర్లను హాకర్లు డార్క్‌ వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్లు తెలుస్తోంది.

భద్రతా పరిశోధకుల అభిప్రాయం ప్రకారం..తాజాగా క్లబ్‌హౌజ్‌ డేటా బేస్‌ హ్యాక్‌ గురైనట్లు గుర్తించారు.  మార్క్ రూఫ్ అనే సైబర్‌ నిపుణుడు క్లబ్‌హౌజ్‌కు చెందిన యూజర్ల ఫోన్‌ నంబర్లు డార్క్‌ నెట్‌లో ఉంచారనే విషయాన్ని ట్విటర్‌లో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. కేవలం క్లబ్‌హౌజ్‌లో ఉన్న వారివి మాత్రమే కాకుండా యూజర్‌కు చెందిన కాంటాక్ట్‌లు యాప్‌తో అనుసంధానించబడిన వ్యక్తుల ఫోన్‌ నంబర్లు కూడా డార్క్‌ నెట్‌లో అమ్మకానికి ఉంచినట్లు పేర్కొన్నాడు. కాగా ఈ డేటా బ్రీచ్‌పై క్లబ్‌హౌజ్‌ ఇంకా స్పందించలేదు. 


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad