AP : ప్రభుత్వ ఉత్వర్వులు ఆన్‌లైన్‌లో పెట్టొద్దు..ఇక ఆఫ్ లైన్ లోనే-అన్ని శాఖలకు సర్క్యులర్..!!


అమరావతి: ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను ఆన్‌లైన్‌లో పెట్టకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జీవోలను ఆఫ్ లైన్లోనే పెట్టేలా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శలుకు సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. పొరుగు రాష్ట్రాల్లో అమలవుతోన్న విధానాలను అనుసరిస్తూ ఆన్‌లైన్‌లో జీవోలను ఉంచడాన్ని నిలిపి వేయాలని  నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇటీవల బ్లాంక్‌ జీవోల జారీ వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. 2008లో వైఎస్ హయాం నుంచి ఏపీ ప్రభుత్వం ప్రజల కోసం జీవోలను ఆన్‌లైన్‌లోఉంచుతోంది.

కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వం జీవోల జారీ వ్యవహారం రాజకీయం వివాదంగా మారింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు రహస్యంగా ఉంచుతోందని..దీని వెనుక ఏదో జరుగుతోందంటూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆరోపణలు చేసింది. దీని పైన నేరుగా గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసింది. ప్రధానంగా ఈ నెలలో జారీ చేసిన బ్లాంక్ జీవోల వ్యవహారం పైన టీడీపీ నిలదీస్తోంది. పారదర్శక పాలన అని చెబుతూ ఎందుకు రహస్య జీవోలు...బ్లాంక్ జీవోలు జారీ చేస్తున్నారని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు.

జగన్ ప్రభుత్వం తాజా నిర్ణయం.. అయితే, గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో..అంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి హాయంలోనూ ఇలా జీవీలు కాన్ఫిడెన్షియల్ లో ఉంచటం సాధారణంగా జరిగే ప్రక్రియే నంటూ అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో 2008 లో జీవోలను ప్రభుత్వ డొమైన్ లో ఉంచటం ఉమ్మడి ఏపీలో మొదలు పెట్టారు. అయితే, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్ లైన్లో జీవోలు పెట్టకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జీవోలను ఆఫ్ లైన్లోనే పెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన చేస్తూ ఇంటర్నల్ సర్క్యులర్ జారీ చేసింది.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad