AP హైకోర్టులో ఏడుగురు ఐఏఎస్ లు హాజరు..

 ఏపీ హైకోర్టులో ఏడుగురు ఐఏఎస్ లు హాజరు-స్కూళ్లలో రైతు భరోసా కేంద్రాల కేసు..


ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు వ్యవహారం ఇవాళ హైకోర్టులో కలకలం రేపింది. ఈ కేసులో విచారణకు ప్రభుత్వం నుంచి ఏకంగా ఏడుగురు ఐఏఎస్ అధికారులు హాజరు కావడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఓ అధికారి హైకోర్టుకు హాజరు కావడమే చర్చించుకునే పరిస్దితుల నుంచి ఏకంగా 7గురు అధికారులు విచారణకు హాజరుకావడంపై ప్రభుత్వంలోనూ చర్చ జరుగుతోంది

ప్రభుత్వ పాఠశాలల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్, బుడితి రాజశేఖర్, చినవీరభద్రుడు, శ్యామలరావు, ఎంఎం నాయక్, విజయ్ కుమార్ హైకోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో ప్రభుత్వం ఇప్పటివరకూ 1180 స్కూళ్లలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అంగీకరించింది. హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో ఇందులో 450 నిర్మాణాలను వేరే ప్రాంతాలకు తరలించినట్లు కూడా తెలిపింది.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad