నూతన విద్యా విధానం పై స్టే విధించండి

హైకోర్టును ఆశ్రయించిన ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు 

అమరావతి, ఆంధ్రప్రభ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడి యట్ అమలులోకి తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ అడ్మిషన్ సిస్టం ఫర్ ఇంటర్మీడియట్ స్ట్రీం (ఏపీఓఏఎస్ ఐఎస్)ను సవాల్ చేస్తూ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళా శాలల యాజమాన్యాల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నిబంధనల రూపకల్పన లేకుండా కేవలం పత్రికా ప్రకటన ద్వారానే నూతన విధానాన్ని అమల్లోకి తీసుకురావటం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయటం తో పాటు పాత పద్ధతిలోనే ప్రవేశాలను కొనసాగించు కునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్ధించిం డి. ఇంటర్ ప్రవేశాలను నేరుగా ఆయా కళాశాలలు చేపట్టే విధానం కొనసాగుతోంది. ఈ విధానంలో ఎలాంటి ఫిర్యాదులు ఎదురవ్వలేదని విద్యార్థుల తల్లి దండ్రులు సైతం ఇందుకు మద్దతిచ్చారని సెంట్రల్ ఆంధ్ర జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియే మేషన్ కార్యదర్శి దేవరపల్లి రమణారెడ్డి పిటిషన్లో వివరించారు. 

పేచీలేని విధానాన్ని పక్కన పెట్టి ఏపీ చట్టం, ఇంటర్మీడియట్ చట్టం, ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చట్టం, ఏపీ విద్యా సంస్థల చట్టాల నిబంధనలకు విరుద్ధమని వివరించారు. ఇంటర్ బోర్డు ఆఘమేఘా లపై ఆన్లైన్ ద్వారా ఇంటర్ ప్రవేశాలను చేపడుతు న్నామని పత్రికా ప్రకటన ఇచ్చిందని గుర్తుచేశారు. జూమ్ మీటింగ్ ద్వారా ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ అసాధ్యమన్నారు. లక్షలాదిమంది ఆన్లైన్ ద్వారా. జరిగే ప్రవేశాలకు హాజరుకావటం అందరికీ ఐడీలు అందడం కష్టసాధ్యమన్నారు. దీనిపై ఎలాంటి సమా వేశాలు, చర్చలు జరపకుండా అభిప్రాయ సేకరణ చేయకుండా నూతన ప్రక్రియను ప్రకటించారని దీని వల్ల విద్యార్ధులు నష్టపోతారన్నారు. ఆన్లైన్ ప్రవే శాల సందర్భంలో విద్యార్థులు స్థానిక, స్థానికేతరహో డాకు సంబంధించి తగిన ఆధారాలు చూపాల్సిందిగా ఇంటర్ బోర్డు నిబంధన విధించిందని గతంలో ఎన్నడూ ఇలాంటి ప్రక్రియ నిర్వహించలేదన్నారు. 

రాష్ట్రం లో ఏ ప్రాంతంలో అయినా ఇంటర్ విద్యార్థులు ప్రవేశం పొందే వీలుండేదని పిటిషన్ వివరించారు. ఇప్పటి వరకు ప్రత్యక్ష పద్ధతిన తమకు నచ్చిన కళాశాలల్లో చేరిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు పరోక్షంగా ఆన్లైన్లో స్వేచ్ఛను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తంగా 2679 జూనియర్ కళాశాలలు ఉండగా అందులో 470 ప్రభు త్వ, 180 ఎయిడెడ్, 2029 అన్ ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయని వివరించారు. ప్రభుత్వ జూని యర్ కళాశాలలతో సహా మొత్తంగా మొదటి సంవ త్సరంలో 9.43 లక్షల సీట్లు మంజూరయ్యాయి. ఈ ఏడాది టెన్త్ 6.24 లక్షల మంది పరీక్షలు రాస్తే అంతా ఉత్తీర్ణులయ్యారు. ఇకా 3.18 లక్షల సీట్లు మిగులు. తాయని కొత్తగా అమల్లోకి వచ్చే విధానంతో సంక్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా కోర్టును అభ్యర్థించారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad