World’s Highest Movie Theatre : ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో సినిమా థియేటర్.. ఇండియాలో ప్రారంభం..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో సినిమా థియేటర్‌ను నిర్మించారు. అది కూడా మన భారత్‌లోనే. ఎక్కడో తెలుసా? లఢక్‌లో. అక్కడి రిమోట్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సినిమా థియేటర్ అనుభవాన్ని అందించడం కోసం.. పిక్సర్ టైమ్ డిజిప్లెక్స్ అనే సంస్థ అక్కడ మొబైల్ థియేటర్‌ను ఏర్పాటు చేసింది.
భూమికి 11,562 అడుగుల పైన లెహ్‌లో.. కొండ మీద దీన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఇది.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సినిమా థియేటర్‌గా చరిత్రకెక్కింది.
గాలితో నింపిన మెటీరియల్ ఉపయోగించి ఈ థియేటర్‌ను నిర్మించారు. ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్ థియేటర్. అక్కడ టెంపరేచర్ మైనస్ డిగ్రీలకు పడిపోయినా కూడా ఆ థియేటర్ చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మించారు
థియేటర్‌ను ఓపెన్ చేశాక.. Sekool అనే సినిమాను ప్రదర్శించారు. లఢక్ ప్రాంతంలో నివసించే చాంగ్‌పా అనే సంచారజాతి మనుషుల ఆధారంగా ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. త్వరలోనే లఢక్ ప్రాంతంలో మరిన్ని మొబైల్ థియేటర్లను ఏర్పాటు చేస్తామని.. పిక్సర్ టైమ్ డిజిప్లెక్స్ సంస్థ వెల్లడించింది.
Ladakh | To bring cinema watching experience to most remote areas, a mobile theatre, situated at an altitude of 11,562 ft, was introduced in Leh.
— ANI (@ANI) August 28, 2021
"It offers affordable tickets & has several facilities. Seating arrangement is also good,"says Mepham Otsal, National School of Drama pic.twitter.com/euBJeVjxNA