సబ్బు వైరస్‌ను ఎలానాశనం చేస్తుంది? how does soap clean germs ?
సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల చేతుల మీద ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లాంటి సూక్ష్మజీవుల నుంచి రక్షణ లభిస్తుంది. ఎందుకంటే వాటిని నాశనం చేయగల అణుధర్మాలు సబ్బుకు ఉన్నాయి. చేతులను సబ్బుతో కనీసం 20 సెకన్లపాటు రుద్దుకుని కుళాయి కింద కడుక్కోవాలి. ఇలా చేస్తే చేతుల మీద ఉండే వైరస్, అది కరోనా అయినా సరే.. నీటితోపాటు చేతి మీద నుంచి ఖాళీ అయిపోతుంది. ఇంతటి సామర్థ్యం సబ్బుకు ఉండటానికి గల రహస్యం దాని హైబ్రిడ్ నిర్మాణమే. సబ్బు అణువుకు ఉండే తలభాగాన్ని హైడ్రోఫిలిక్, తోకభాగాన్ని హైడ్రోఫోబిక్ అంటారు. హైడ్రోఫిలిక్ భాగం తక్షణమే నీటితో బంధం ఏర్పరచుకోగలదు. హైడ్రోఫోబిక్ భాగం నూనె, కొవ్వు వంటి వాటితో అనుసంధానం అవుతుంది. సబ్బుకు ఉండే ప్రత్యేక లక్షణం ఏమిటంటే మన చర్మానికి వైరస్‌కు నడుమ ఉండే జిగురు వంటి పదార్థాన్ని తొలగించగలుగుతుంది. నీటి ప్రవాహంలో సబ్బుతో శుభ్రం చేసుకున్న చేతులు ఉంచినపుడు ఆ నీరు సబ్బు అణువుకున్న హైడ్రోఫిలిక్ భాగాన్ని తనతో తీసుకుపోతుంది. దీంతో సబ్బు అణువు తోకభాగం వద్ద ఉన్న నూనె, కొవ్వు, వైరస్‌లు సైతం సబ్బు అణువుతో చేతి నుంచి విడుదలై బయటకు వెళ్లిపోతాయి. సబ్బు మాత్రమే చాలా ప్రతిభావంతంగా ఇలా వైరస్‌ను నాశనం చేసి చేతులను శుభ్రంగా ఉంచుతుంది
How Does Hand Soap Work to Kill Bacteria?
Now you know it's critical to use soap when washing your hands. But it's important to note that soap helps to remove germs from your hands—not necessarily kill them.
More specifically, it's the surfactants in hand soap that remove the germs, according to the CDC. Surfactants are compounds that lower the surface tension of water and break down molecular barriers. In other words, surfactants make your hands slippery and make it harder for dirt, debris, or germs to grab hold and stay.
Whether you use a bar or liquid soap, it reduces the microbe count on your skin by mechanical measures. Soap "pulls" off debris and anything else on your hands and moves it into the running water.