Corona Virus : పాఠశాలల్లో కరోనా భయం

   పశ్చిమ గోదావరి , చిత్తూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో అధిక కేసులు

   పిల్లలను బడికి పంపించేందుకు వెనకడుగేస్తోన్న తల్లిదండ్రులు

    ఇప్పటికీ 45 శాతమే హాజరు


అమరావతి బ్యూరో : తెరిచిన వారంలోనే పాఠశాలల్లో కరోనా కేసులు నమోదవడంతో అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కరోనా రావడంతో పిల్లల తల్లిదండ్రులు భయపడుతూ వారిని పాఠశాలలకు పంపించేందుకు వెనకడుగు వేస్తున్నారు. పాఠశాలల్లో గదికి 20 మంది చొప్పున పిల్లలను కూర్చోబెట్టి తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ లెక్కన తరగతి గదులు సరిపోతే ప్రతిరోజూ అందరికీ తరగతులు చెబుతున్నారు. గదులు చాలకపోతే రోజు తప్పించి రోజు పాఠాలు చెబుతున్నారు. పాఠశాలల వద్ద కరోనా నివారణ చర్యలూ చేపడుతున్నారు. ఇటీవల చిత్తూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కరోనా రావడంతో మిగతా ప్రాంతాల్లో పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు భయపడుతున్నారు.

రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభించిన తరువాత ఈ వారం రోజుల్లో 21 మంది పిల్లలకు కరోనా సోకినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మరో ఏడుగురు ఉపాధ్యాయులకు వ్యాధి సోకింది. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని డిఆర్‌ఎం మున్సిపల్‌ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు, మరో ముగ్గురు టీచర్లు, నలుగురు విద్యార్థులకు కరోనా సోకింది. చిత్తూరు జిల్లాలోని ఓ పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు, అదే జిల్లా శ్రీకాళహస్తి రూరల్‌ మండలం కాపుగున్నేరి పంచాయతీ పరిధి ఎంఎంసి కండ్రిగలోని ప్రాథమిక పాఠశాలలో మరో ఐదుగురు విద్యార్థులకు వ్యాధి సోకింది. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం భావదేవరపల్లి ఎంపియుపి స్కూల్లో ముగ్గురు విద్యార్థులకు కరోనా నిర్ధారించారు. దీంతో అక్కడ ఎంఇఒ రాందాస్‌ పాఠశాలకు మూడు రోజులు సెలవు ప్రకటించారు. ఈ మూడు జిల్లాల్లో కేసులు నమోదు కాకముందు రాష్ట్రవ్యాప్తంగా 65 శాతం మంది పిల్లలు బడికి వెళ్లేవారు. ఎప్పుడైతే కేసులు నమోదయ్యాయని తెలిసిందో చాలా మంది తమ పిల్లలను బడికి పంపించడం లేదు. ఫలితంగా 45 శాతం హాజరు నమోదవుతోంది. ఈ సంఖ్య ఇంకాస్త తగ్గేటట్టు కనిపిస్తోంది.నిన్న ఒక్క రోజే పశ్చిమ గోదావరి జిల్లాలో 12 మంది విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడటం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించే  విషయం . పిల్లలని స్కూల్ కి మాపాలో వద్దో తెలియని పరిష్టితి. రానున్న రోజుల్లో థర్డ్‌వేవ్‌ వచ్చే ప్రమాదం ఉందని, ఇది పిల్లలపైనే ప్రభావం చూపుతోందని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. సెప్టెంబరు మూడోవారం నుంచి అక్టోబరు చివరి వరకూ దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, రోజువారీ కేసులు దేశవ్యాప్తంగా లక్షల్లో నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ కావడంతో పిల్లల తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందుతున్నారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad