Ola Electric Scooter: విడుదలైన ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే.. సబ్సీడీతో ధర కూడా తక్కువే..!

Ola Electric Scooter: ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తోన్న ఓలా స్కూటర్‌ నేడు విడుదలైంది. ఆగస్టు 15 మధ్యాహ్నం 2 గంటలకు ఓలా స్కూటర్ సీఈవో భవీస్ అగర్వాల్ విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఈ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇప్పటికే ఈ స్కూటర్‌పై ఎన్నో అంచనాలు నెట్టింట్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. వీటితోపాటు ఎలక్ట్రిక్‌ వెహకిల్స్‌ బుకింగ్‌లోనూ సరికొత్త రికార్డ్‌లను నెలకొల్పింది. ఇప్పటికే కొన్ని ఆసక్తికరమైన ఫీచర్స్‌ను ఓలా కంపెనీ ప్రకటించి స్కూటర్‌పై ఆసక్తిని పెంచింది. తాజాగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లను, ధరతోపాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో భవీస్ అగర్వాల్ వెల్లడించారు. కేవలం రూ. 499లతో బుకింగ్ చేసుకునే అవకాశాన్ని అందించడంతో 24 గంటల్లో దాదాపు 1000 నగరాల్లో లక్ష ఫ్రీ బుకింగ్‌లతో రికార్డు నెలకొల్పింది.


ఓలా ఈ -స్కూటర్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది – ఓలా ఎస్1, ఎస్1 ప్రో

ఓలా ఎస్ 1 ధర రూ .99,999లతో అందుబాటులో ఉంది. అలాగే ఓలా ఎస్1 ప్రో రూ .1,29,999లలో లభించనుంది. కేంద్రం అందించే సబ్సిడీలతో పలు రాష్ట్రాల్లో ధరల్లో మార్పులుంటాయి.

అందుబాటులోకి..

ఓలా ఎస్1, ఎస్1 ప్రో సిరీస్ సెప్టెంబర్ నుంచి కొనుగోలు కోసం అందుబాటులో ఉంటాయి. అయితే షిప్పింగ్ మాత్రం అక్టోబర్‌ నుంచి ప్రారంభమవుతుంది.

ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 గరిష్ట వేగం..

ఓలా ఎస్1 కేవలం 3 సెకన్లలో 0kmph నుంచి 40kmph వరకు వెళ్లగలదు. అలాగే గరిష్టంగా 115 కి.మీ. వెళ్లగలదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ 181 కిమీల వరకు వెళ్తుంది.

ఓలా ఎస్1 రివర్స్ మోడ్, హిల్ హోల్డ్ ఫీచర్లు..

ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ రివర్స్ మోడ్‌తో వస్తుంది. ఇది రైడర్‌కి కఠినమైన ట్రాఫిక్ పరిస్థితుల నుంచి సులభంగా బయటపడేందుకు సహాయపడుతుంది. అలాగే హిల్ హోల్డ్ ఫీచర్‌తో ఎత్తుపైకి వెళ్లేటప్పుడు ఏమంత కష్టంగా ఉండబోదు. ఈ-స్కూటర్ కూడా క్రూయిజ్ కంట్రోల్ మోడ్‌తో కూడిన పవర్ లేదా బ్యాటరీ లైఫ్‌కు ప్రాధాన్యత ఇచ్చేందుకు మూడు మోడ్‌లతో పనిచేయనుంది. ఇందులో మూడు డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. నార్మల్, స్పోర్ట్, హైపర్‌ మోడ్స్‌లో పనిచేస్తుంది.

ఫుల్ ఛార్జ్‌తో ఓలా S1 డ్రైవింగ్ రేంజ్ 181 కి.మీ

ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీష్ అగర్వాల్ వెల్లడించిన వివరాల మేరకు S1 స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు 181 కి.మీ. చేరుకోగలదు. అలాగే S1 స్కూటర్ కేవలం 3 సెకన్లలో 0 kmph నుంచి 40 kmph వరకు వెళ్లగలదని అగర్వాల్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనం గరిష్టంగా 115 కి.మీ వెళ్లగలదని ఆయన వెల్లడించారు.

ఓలా ఎలక్ట్రిక్ ఈ-స్కూటర్ ఛార్జింగ్ సమయం

ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించడం ద్వారా కస్టమర్‌లు కేవలం 18 నిమిషాల్లో 50శాతం వరకు ఈ-స్కూటర్‌ను ఛార్జ్ చేసుకోవచ్చని ఓలా కంపెనీ వివరించింది. రెగ్యులర్ ఛార్జింగ్ స్టేషన్‌లో, ఎలక్ట్రిక్ స్కూటర్ 0 నుంచి ఫుల్ ఛార్జ్ కావడానికి 2.5 గంటలు పడుతుంది. ఇంట్లో ఒక సాధారణ ప్లగ్‌తో 5.5 గంటల సమయం పడుతుంది.

ఓలా ఎలక్ట్రిక్ ఈ-స్కూటర్ సబ్సీడీ

ఓలా ఈ-స్కూటర్ 50శాతం ఛార్జ్‌తో 75 కిమీ వరకు ప్రయాణం చేయగలదని వెల్లడించింది. ఇది ఫుల్‌గా ఛార్జ్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ 150 కిమీ ప్రయాణం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ వాహనం 3.4kWh బ్యాటరీని కలిగి ఉంది. దీంతో ప్రభుత్వ FAME-II సబ్సిడీకి అర్హత పొందుతుంది.

ఓలా ఎలక్ట్రిక్ ఈ-స్కూటర్ కలర్స్..

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 10 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. నీలం, నలుపు, ఎరుపు, గులాబీ, పసుపు, తెలుపు, సిల్వర్ షేడ్స్‌లో మ్యాట్, గ్లోస్ ఎంపికల్లో ఉండనున్నాయి.

ఓలా ఎలక్ట్రిక్ ఈ-స్కూటర్ వేరియంట్లు

కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మెరుగైన సేవలందించేందుకు ఓలా ఈ-స్కూటర్ మూడు విభిన్న వేరియంట్లలో లభించనుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ మొదటి వేరియంట్ 2kW మోటార్ కలిగి ఉంటుంది. ప్రాథమిక మోడల్ గరిష్ట వేగం గంటకు 45 కి.మీ. రెండవ మిడ్ వేరియంట్ 4kW మోటార్ కలిగి ఉంటుంది. గరిష్టంగా 70 kmph వేగాన్ని పొందగలదు. ఓలా ఎలక్ట్రిక్ ఈ-స్కూటర్ టాప్-ఎండ్ వేరియంట్ 7kW మోటార్ కలిగి ఉంటుంది. అలాగే గరిష్టంగా 95 kmph వేగాన్ని కలిగి ఉంటుంది.

ఓలా ఎలక్ట్రిక్ ఈ-స్కూటర్ బుకింగ్

వినియోగదారులు నెట్-బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డులు, యుపీఐ, ఈ-వాలెట్‌లు లేదా ఓలామనీ ద్వారా రూ .499 చెల్లించి ఈ-స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు.

Ola (1)ఓలా స్కూటర్ ఫీచర్లు, ధర వివరాలు..

  1. ఓలా స్కూటర్ ఎస్ 1, ఎస్ 1 ప్రో అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.
  2. గరిష్ట వేగం గంటకు 115 కిమీ.
  3. ఇందులో మూడు డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. నార్మల్, స్పోర్ట్, హైపర్‌ మోడ్స్‌లో పనిచేస్తుంది.
  4. స్కూటర్ 3 సెకన్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
  5. స్కూటర్ 190 కిమీ డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది.
  6. స్కూటర్ అద్భుత ఫీచర్‌తో పాటు క్రూయిజ్ కంట్రోల్ వంటి హిల్ హోల్డ్‌తో రానుంది.
  7. స్కూటర్ ఎస్1లో 7 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇది 3 జీబీ ర్యామ్‌తోపాటు ఆక్టా కోర్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.
  8. ప్రత్యేక అప్లికేషన్ ఉపయోగించి స్కూటర్‌ను ఆటోమేటిక్‌గా లాక్, లేదా అన్‌లాక్ చేయవచ్చు.
  9. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా మూడ్స్ ఫీచర్ ఆకట్టుకుంటుంది. డిస్‌ప్లే థీమ్‌కి సరిపోయేలా విభిన్న ఓడోమీటర్ స్టైల్స్, సౌండ్‌లను కూడా అందిస్తుంది.
  10. ఓలా ఎస్1 లోకల్ నావిగేషన్ అప్లికేషన్‌తో వస్తుంది.
  11. స్కూటర్‌లో అంతర్నిర్మిత స్పీకర్‌లు కూడా ఉన్నాయి. వీటిని ఫోన్ కాల్స్ స్వీకరించడానికి కూడా ఉపయోగించుకోవచ్చు.
  12. ఓలా ఎస్1 బూట్‌లో రెండు హెల్మెట్‌లను నిల్వ చేసే సామర్థ్యం ఉంది.
  13. ఓలా ఎస్1 ధర రూ. 99,999 (ఎక్స్-షోరూమ్ ధర)
  14. ఓలా ఎస్ 1 ప్రో ధర రూ.1,29,999 (ఎక్స్-షోరూమ్ ధర)
  15. కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీతో పలు రాష్ట్రాల్లో ధరలు తక్కువగా ఉంటాయి.
  16. ఢిల్లీలో ఓలో స్కూటర్ ధర రూ. 85,099 నుంచి ప్రారంభమవుతుంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్‌పై)
  17. గుజరాత్‌లో రూ. 79,999 నుంచి ప్రారంభమవుతాయి.
  18. మహారాష్ట్రలో రూ. 94,999 వద్ద ప్రారంభమవుతాయి.
  19. రాజస్థాన్‌లో రూ. 89,968 వద్ద ప్రారంభమవుతాయి.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad