SBI PIN: స్టేట్ బ్యాంక్ ATM పిన్ మర్చిపోతే ఇలా చెయ్యండి..!


మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఎకౌంట్ వుందా..? మీరు స్టేట్ బ్యాంక్ ఏటీఎం వాడుతున్నారా….? అయితే ఖచ్చితంగా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. అయితే ఇది వరకు అయితే ఏటీఎం కార్డు పిన్ పోస్ట్ ద్వారా వచ్చేది. ఒకవేళ కనుక ఆ పిన్ ని మరచిపోతే మళ్ళీ బ్యాంక్ కి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. మరెంత ఈజీగా ఇప్పుడు పిన్ ని తెలుసుకో వచ్చు.

ఇందుకోసం ఎస్‌బీఐ కస్టమర్లు 1800 112 211 లేదా 1800 425 3800 నెంబర్లకు కాల్ చేసి ఈజీగా పిన్ నెంబర్ మనం తెలుసుకోవచ్చు అని ఎస్బీఐ తెలిపింది. అయితే ఏటీఎం కార్డు నెంబర్, అకౌంట్ నెంబర్ తప్పక ఉండాలి. అలానే రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచే ఫోన్ చేయాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి.

ఒకవేళ కనుక మరో నెంబర్ నుండి కాల్ చేస్తే పిన్ జనరేట్ అవ్వదు. ఇవన్నీ తప్పక రెడీగా ఉంచుకుని 1800 112 211 లేదా 1800 425 3800 నెంబర్‌కు కాల్ చేయాలి. పిన్ జెనరేట్ ఆప్షన్ ని ఎంచుకోవడం తర్వాత 11 అంకెల అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలానే పుట్టిన సంవత్సరం ఎంటర్ చేయాలి. ఇలా అక్కడ చెప్పే దాని ప్రకారం ఎంటర్ చేసేసి ఈజీగా పిన్ జెనరేట్ చేసుకో వచ్చు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad