Adhar: ‘ఆధార్‌’లో ఇకపై ‘తండ్రి పేరు‘, ‘భర్త పేరు’ ఉండదు..

 ‘ఆధార్‌’లో ఇకపై ‘తండ్రి పేరు‘, ‘భర్త పేరు’ ఉండదు...మరి?



న్యూఢిల్లీ: దేశంలోని పౌరుల దగ్గర ఉండాల్సిన అతి ముఖ్యమైన ధ్రువపత్రాలలో ఒకటైన ఆధార్ కార్డులో పలు మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇకపై మీరు ఆధార్ కార్డును అప్‌డేట్ చేస్తే, దానిలో ‘తండ్రి పేరు‘, ‘భర్త పేరు’ ఉండదు. అంటే కార్డుదారుని బంధుత్వం దానిలో వెల్లడికాదు. అది గుర్తింపు రూపంలో మాత్రమే ఉంటుంది. ఆధార్ కార్డులో ఇకపై తండ్రి లేదా భర్త పేరు దగ్గర కేరాఫ్ అని ఉంటుంది. ఇటీవల ఒక దరఖాస్తుదారు తన చిరునామా మార్పు చేస్తూ, తన కుటుంబానికి సంబంధించిన ఆధార్ కార్డులను అప్‌డేట్ చేశాడు. అయితే దీనిలో తండ్రి పేరు ఉండాల్సిన చోట కేరాఫ్ అని ఉంది. 

పొరపాటు జరిగిందని భావించిన అతను ఆధార్ కేంద్రానికి విషయం తెలియజేశారు. అయితే ఇకపై ‘తండ్రి పేరు‘, ‘భర్త పేరు’ స్థానంలో కేరాఫ్ అని ఉంటుందని అక్కడి సిబ్బంది తెలిపారు. ఈ మార్పు గురించి కామన్ సర్వీస్ సెంటర్ అధీకృత మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ త్యాగి మాట్లడుతూ ఇకపై ఆధార్ కార్డులో తండ్రి, కొడుకు, కుమార్తెకు బదులుగా ‘కేరాఫ్’ అని ఉంటుందని తెలిపారు. దరఖాస్తుదారు కూడా ‘కేరాఫ్’ లో సంబంధాన్ని తెలియజేయకుండా కేవలం పేరు రాస్తే సరిపోతుందన్నారు. ఈ విధంగా ఆధార్ అప్‌డేట్ జరుగుతుందన్నారు. 2018లో సుప్రీంకోర్టు ఆధార్ కార్డుకు సంబంధించి తన నిర్ణయం వెలువరించింది. ప్రజల గోప్యతకు ఏవిధంగానూ భంగం కలిగించకూడదని సూచించింది.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad