స్కూళ్లెందుకు తెరిచారు? విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?

 ♦విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?

 ♦రేపు ఏదైనా జరిగితే.. ఎవరు బాధ్యులు?

 ♦టీచర్లకు వ్యాక్సిన్ వేస్తే సరిపోతుందా?

 ♦నిపుణుల హెచ్చరికలు పట్టటం లేదా?

 ♦ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం

 ♦పాఠశాలల ఆవరణల్లో ఆర్బీకే, గ్రామసచివాలయాలను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు

 ♦విచారణకు నలుగురు ఐఏఎస్ హాజరు

 


అమరావతి, ఆంధ్రప్రభ : కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పుపై నిపుణులు హెచ్చరికలు చేస్తున్నా మీకు పట్టవా.. క్షేత్ర స్థాయిలో ఏ పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు? ఇంత హడావిడి అవసరమా? దేశ వ్యాప్తంగా కోర్టుల్లోనే భౌతిక విచారణ జరగటంలేదు.. ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ వేశాంకదా.. అని పాఠశాల లు తెరిస్తే రేపు విద్యార్థులకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. పాఠశాల లకు వెళ్లిన విద్యార్థులకు కరోనా సోకితే ఏంచేస్తారని ప్రశ్నించింది. విద్యార్థులు.. వారి తల్లిదండ్రు లందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేయకుండా ఆగమేఘాలపై ప్రతిష్ట కోసం పాఠశాలలను పున ప్రారంభించటం అనాలోచిత నిర్ణయమని స్పష్టం చేసింది. ఇది విద్యార్థు ల ప్రాణాలతో చలగాటమాడటమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో ఏర్పాటు చేస్తున్న రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయా లను వెంటనే ఖాళీచేయాలని ఆదేశించింది. వివిధ జిల్లా ల్లో ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాల్లోరైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు నిర్మించటాన్ని సవాల్ చేస్తూ గత ఏడాది వివిధ జిల్లా లకు చెందిన పలువురు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ప్ర భుత్వ విద్యా సంస్థల ఆవరణలో ఇతర నిర్మాణాలు చేపట్టరాదని గతంలోనే ఉత్తర్వులు జారీచేశారు. అం కార్యాల యాలు ఏర్పాటవుతున్నాయని హైకోర్టు కు ఫిర్యాదు లు అందాయి. అధికారుల నిర్లక్ష్యాన్ని కోర్టు ధిక్కరణ గా భావించి సుమోటోగా స్వీకరించి వివిధశాఖల ఉన్నతాధికారులను స్వయం గా కోర్టుకు పిలి పించి వివరణ కోరింది. కరోనా సమయంలో పాఠశాలల పునరుద్ధరణ, విద్యాసం సల్లో ఆర్బీకే, గ్రామ, వార్డు సచివాలయాలఏర్పాటుకు సంబంధించిన వ్యాజ్యాలు తాజాగా మంగళవారం మరోసారి విచారణకు వచ్చాయి. పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్, కమిషనర్ చినవీరభద్రుడు, పంచాయతీ రాజ్ ముఖ్యకార్య దర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, పురపాలకశాఖ ముఖ్యకార్య దర్శి జె శ్యామలరావు హాజరయ్యారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాల్సిందిగా మెమో దాఖలు చేశారు.

ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహ న్రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది కె రఘువీర్ వాదనలు వినిపించారు. పాఠశాలల్లో ఏర్పాటైన రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు ఖాళీ చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామని చాలా వరకు తరలింపు పూర్తయిందని వివరణ ఇస్తూ అందుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు నివేదించినట్లు చెప్పారు. త్వరలో పూర్తి స్థాయిలో ఖాళీ చేయిస్తామన్నారు.

దీనిపై వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు ఆదేశాల అమ లును వివరిస్తూ అదనపు అఫిడవిట్లు దాఖలు చేయాలన్నారు. తదుపరి విచారణ అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేస్తూ వచ్చే విచారణకు ఉన్నతాధి కారులను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించారు. పాఠశాలల పున ప్రారంభంపై న్యాయమూర్తి ఆసక్తికరమైన వ్యా ఖ్యలు చేశారు. రాష్ట్ర సచివాలయంలో కూర్చుని ఉత్తర్వులు జారీ చేస్తే సరిపోదు.. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో తెలుసుకుంటే మంచిదని ఉద్ఘాటించింది.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad