ఉపాధ్యాయులకు యాప్ ల భారం తగ్గిస్తాం..చినవీరభద్రుడు

 ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులపై యాప్ భారం తగ్గిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనరు చినవీరభద్రుడు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం నాయకులతో ఆయన కార్యాలయంలో సోమవారం చర్చలు జరిపారు. సర్వర్ సామర్థ్యం పెంచి యాప్ల వినియోగం సులభతరం చేస్తామని హామీ ఇచ్చారు.. జగనన్న విద్యాకానుక పంపిణీ, బయోమెట్రిక్ తదితర లంశాల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్వహణ శానిటరీ వర్కర్లకు ఆగస్టు నుంచి రూ. 6 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు.

విద్యార్థులకు ప్రత్యేక ఫీజు వసూలును రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇస్తామన్నారు. నాడు నేడు అభివృద్ధి చేసిన పాఠశాలలకు కరెంట్ బిల్లు, ఇతర మెయింటెనెన్స్ ఖర్చుల నిమిత్తం ప్రతి హైస్కూల్కూ రూ.5 లక్షలు మంజూరు చేస్తామన్నారు. ఖాళీగా ఉన్న ఎంకకు. ఉప విద్యాశాఖ అధికారులు పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తామన్నారు. అప్గ్రేడ్ పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల పోస్టుల మంజూరుపై ఆర్ధిక శాఖకు మరోసారి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందిని రేషనలైజేషన్ చేయడానికి పంచాయతీరాజ్ కమిషనర్న సంప్రదించి పరిష్కారిస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షు ప్రధాన కార్యదర్శులు జివి నారాయణ రెడ్డి, వి.శ్రీనివాసరావు, కోశాధికారి రమణయ్య తదితరులు. పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad