20 కోట్ల పన్ను ఎగవేసిన సోనూ సూద్...... దాడులపై మండిపడ్డ ఆమ్ ఆద్మీ, శివ్ సేన..
IT Dept conducted a search & seizure op at various premises of a prominent actor in Mumbai & also a Lucknow-based group of industries engaged in infrastructure development. 28 premises in Mumbai, Lucknow, Kanpur, Jaipur, Delhi, Gurugram covered: Central Board of Direct Taxes.
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఇంట్లో వరుసగా మూడు రోజుల పాటు ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. అయితే నటుడు సోనూ సూద్ సుమారు 20 కోట్ల మేర ఆదాయపన్నును ఎగవేసినట్లు ఇవాళ ఆ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సోనూ సూద్‌కు చెందిన నాన్ ప్రాఫిట్ సంస్థ ఫారిన్ కాంట్రిబ్యూషన్ చట్టాన్ని ఉల్లంఘించి సుమారు 2.1 కోట్లు సమీకరించినట్లు ఐటీశాఖ చెప్పింది. నటుడికి సంబంధించిన ఇండ్లు, అతని అసోసియేట్స్ ఇండ్లు, ఆఫీసుల్లో నిర్వహించిన తనికీలు పన్ను ఎగవేతకు చెందిన అనేక పత్రాలు దొరికినట్లు ఐటీశాఖ తెలిపింది.
కరోనా మహమ్మారి వేళ హీరో సోనూ సూద్ తన విరాళాలతో ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే. సోనూ సూద్ చారిటీ ఫౌండేషన్ సంస్థను గత ఏడాది జూలైలో ప్రారంభించారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఆ సంస్థ 20 కోట్లు విరాళాల రూపంలో సేకరించినట్లు తెలుస్తోంది. దీంట్లో ఇప్పటి వరకు 1.9 కోట్లను ఖర్చు చేశారు. మరో 17 కోట్లు ఆ సంస్థ బ్యాంక్ అకౌంట్లోనే ఉన్నాయి.
I-T Dept conducted a search & seizure op at various premises of a prominent actor in Mumbai & also a Lucknow-based group of industries engaged in infrastructure development. 28 premises in Mumbai, Lucknow, Kanpur, Jaipur, Delhi, Gurugram covered: Central Board of Direct Taxes
— ANI (@ANI) September 18, 2021
మండిపడ్డ ఆమ్ ఆద్మీ, శివ్ సేన
గత బుధవారం నుంచి ఐటీ అధికారులు సోనూసూద్, అతని సహచరుల ఇళ్లల్లో జరుపుతున్న దాడులపై ఆమ్ ఆద్మీ, శివసేన పార్టీలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా కష్టకాలంలో పేదలకు అండగా నిలిచిన సోనూసూద్ టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఒకప్పుడు బీజేపీ సోనూ సూద్‌ని ప్రశంసించేది. కానీ ఢిల్లీ- పంజాబ్ ప్రభుత్వాలు అతనితో సత్సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో పన్ను ఎగవేతదారుడిగా ముద్రవేస్తుందని శివసేన వ్యాఖ్యానించింది.
కాగా, మహమ్మారి సమయంలో వలస కార్మికుల్ని వారి స్వగ్రామాలకు చేర‍్చించిన విధానం జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రివాల్ సోనూని ఆప్ పార్టీ తరపున దేశ్ కా మెంటర్‌గా నియమించారు. అయితే ఐటీ అధికారుల దాడుల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్..,సోనూసూద్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు. సత్య మార్గంలో లక్షలాది ఇబ్బందులు ఉన్నాయి, కానీ సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుంది. కష్టకాలంలో ఉన్న సోనుసూద్‌కి మద్దతుగా లక్షలాది కుటుంబాల ప్రార్థనలు ఉన్నాయని ట్వీట్ చేశారు.
सच्चाई के रास्ते पर लाखों मुश्किलें आती हैं, लेकिन जीत हमेशा सच्चाई की ही होती है। @SonuSood जी के साथ भारत के उन लाखों परिवारों की दुआएं हैं जिन्हें मुश्किल घड़ी में सोनू जी का साथ मिला था। https://t.co/qsAyYvzkQP
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 15, 2021