అదే జరిగితే ఇంక ఇంటర్నెట్ బంద్: ‘కరోనా’తో పోలిక.. మహా తుపానుతో భారీ డ్యామేజ్‌

 అదే జరిగితే ఇంక ఇంటర్నెట్ బంద్.


Internet Apocalypse? Researcher claims solar 'superstorm' could cause global internet outage

సౌర తుపాను అంటే సూర్యుడిపై ఏర్పడే విద్యుత్‌ తరంగం. సూర్యునిలో ఏర్పడే అసాధారణమైన అయస్కాంత విస్ఫోటనం ఇది. ఈ అలలు చుట్టుకుని మబ్బులా ఏర్పడి సూర్యుడి ఉపరితలాన్ని విచ్ఛేదనం చేయడం, సన్నటి పదార్థాలను ఊడ్చేయడం చేస్తాయి. ఈ తుపాన్లు భూమితో పాటు మిగతా గ్రహాలపై ప్రభావం చూపెట్టనుంది. 

Solar Strom: ‘కరోనా’తో పోలిక.. మహా తుపానుతో భారీ డ్యామేజ్‌!. మనకేం ఫరక్‌ పడదు

Solar Super Strom: ‘‘సౌర తుపాను వచ్చేస్తోంది.. కమ్యూనికేషన్‌ వ్యవస్థ కుప్పకూలడం ఖాయం’’ అంటూ గత కొంతకాలంగా భూమికి దడ పుట్టిస్తున్న ప్రచారం, సైంటిస్టులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జులై మధ్యలో ‘సౌర తుపాను’ దాటేసిందన్న కొన్ని మీడియా హౌజ్‌ల కథనాలు.. ఉత్తవేనని తేల్చి చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే సౌర తుపాను ముప్పు మాత్రం భూమికి పొంచి ఉందని.. అది జరిగితే మాత్రం ఇంటర్నెట్‌ ఆగిపోయి కోలుకోలేని నష్టం చవిచూడాల్సి వస్తోందని చెప్తున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ ఇర్విన్‌కు చెందిన అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ సంగీత అబూ జ్యోతి.

‘సౌర తుపానుల వల్ల ఇంటర్నెట్‌ వ్యవస్థపై ముఖ్యంగా సముద్ర అంతర్భాగం గుండా విస్తరించి ఉన్న కేబుల్‌ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. జీపీఎస్‌ వ్యవస్థ కుప్పకూలుతుంది. అప్పుడు మొత్తం వ్యవస్థ ఆగిపోతుంది. ఇది కరోనా మహమ్మారిలాగే విరుచుకుపడొచ్చు’ అని ఆమె చెప్తున్నారు. సౌర తుపాన్లనేవి అరుదుగా వస్తుంటాయి. గతంలో 1859, 1921లో భూమిని తాకాయి. 1989లో ఓ మోస్తరు తుపాను కూడా సంభవించింది. ఆయా సమయాల్లో రేడియో వ్యవస్థలు మూగబోయాయి. అయితే ఇప్పుడున్నంత ఎలక్ట్రిక్ గ్రిడ్స్‌, ఇంటర్నెట్‌​ వ్యవస్థ ఆ సమయంలో లేదు. కాబట్టే.. ఇప్పుడు ఓ మోస్తరు తుపాను వచ్చినా తీవ్ర నష్టం ఉంటుందని అబూ జ్యోతి చెబుతున్నారు.

సిగ్‌కామ్‌ 2021(SIGCOMM 2021) పేరుతో జరిగిన డేటా కమ్యూనికేషన్‌ కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు సౌర తుపానుల మీద ఆమె సమర్పించిన ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ సౌర తుపాన్‌ గనుక భూమిని తాకితే.. ఆ ప్రభావంతో గంటల నుంచి రోజుల తరబడి కమ్యూనికేషన్‌ వ్యవస్థ ఆగిపోనుందని ఆమె అంటున్నారు.  ఈ వాదనతో పలువురు సైంటిస్టులు, ప్రొఫెసర్లు సైతం అంగీకరించడం విశేషం.


కరోనా తరహాలోనే.. 

సముద్ర అంతర్బాగం నుంచి విస్తరించి ఉన్న ఇంటర్నెట్‌ కేబుల్స్‌పై సౌర తుపాను తీవ్ర ప్రభావం చూపెడుతుంది. ఆప్టికల్‌ సిగ్నల్స్‌ తరచూ ఇబ్బందికి గురికావడంతో అంతర్గత వ్యవస్థల్లో పెద్ద ఎత్తున్న డ్యామేజ్‌ జరగొచ్చు. అప్పుడు మొత్తం ఇంటర్నెట్‌ సేవలకు అంతరాయం కలుగుతుంది. ఆ ప్రభావం ఎన్నిరోజులు చూపెడుతుంది? ఎన్నిరోజుల్లో తిరిగి యధాస్థితికి తీసుకురావొచ్చు అనే విషయాలపై మాత్రం ఇప్పుడే అంచనాకి రాలేం. ఒక రకంగా ఇది కరోనా మహమ్మారి లాంటిది. అంత పెద్ద విపత్తును ఎదుర్కొవడానికి అంతర్జాతీయ సమాజం సిద్ధంగా లేదు. నష్టం కూడా ఊహించినదానికంటే భారీగానే ఉంటుంది అని ఆమె అంచనా వేస్తున్నారు

ఒకవేళ నిజంగా సౌరతుపాను గనుక విరుచుకుపడితే మాత్రం.. ఆసియా దేశాలకు డ్యామేజ్‌ తక్కువగా ఉండొచ్చని ఆమె అంటున్నారు. ఎందుకంటే.. భూమధ్య రేఖకు దగ్గరగా సముద్ర గర్భ కేబుల్స్‌ ఉండడం కలిసొచ్చే అంశమని చెప్తున్నారు. ఈ లెక్కన భారత్‌ సహా మరికొన్ని దేశాల కమ్యూనికేషన్‌ వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చనే చెప్తున్నారు.  అయితే అట్లాంటిక్‌, ఫసిఫిక్‌ మహాసముద్రాల పరిధిలోని అంతర్గత కేబుల్‌ వ్యవస్థ మాత్రం సౌర తుపానుతో ఘోరంగా దెబ్బతింటుందని చెప్తున్నారామె.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad