మధ్యాహ్న భోజనంలో ప్లాస్టిక్ బియ్యం? విచారణకు ఆదేశించిన డిప్యూటీ స్పీకర్

 మధ్యాహ్న భోజనంలో ప్లాస్టిక్ బియ్యం? విచారణకు ఆదేశించిన డిప్యూటీ స్పీకర్ కోనా

కర్లపాలెం (గుంటూరు జిల్లా) సెప్టెంబర్ 3. ప్రకాశవార్త: ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో ప్లాస్టిక్ బియ్యం వచ్చాయంటూ మండలంలో శుక్రవారం పాల్చల్ జరిగింది. వివరాల్లోకి వెలితే మండల పరిధిలోని కర్లపాలెం ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద పంపిణి చేసే బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలిపి రావడం జరిగిందని.. దీంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు వంట సమయంలో బియ్యాన్ని పరిశీలించగా అని మాములు బియ్యం కంటే తేడాగా ఉన్నట్లు గుర్తించారు. గతంలో సోషల్ మీడియాలో ప్లాస్టిక్ బియ్యం వచ్చినట్లుగా ఇవి ఉన్నాయని ఇవి తినటం వలన విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తే విధంగా ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. విచారణకు ఆదేశించిన డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి:

మండల పరిధిలోని కర్లపాలెం ప్రభుత్వం పాఠశాలలో భోజన పధరంలో అందించిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం వచ్చాయనే విషయం తెసుకున్న డిప్యూటీ స్పీకర్ విద్యాశాఖ అధికారులకు సమాచారం. ఇచ్చి దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. దీని పై విద్యార్థుల తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెండవద్దని ఆయన తెలిపారు. బియ్యం సరఫరా చేసిన కాంట్రాక్టర్ పై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad