NEET Exam: ఈనెల (September) 12న షెడ్యూల్ ప్రకారం యథాతథం: సుప్రీంకోర్టు
నీట్ పరీక్ష నిర్వహిస్తున్న రోజునే ఇతర పోటీ పరీక్షలు కూడా ఉన్నాయని.. అలాగే సీబీఎస్‌ఈ కంపార్ట్‌మెంట్ పరీక్షలు కూడా జరుగుతున్నాయని.. అందువల్ల నీట్ పరీక్షను మరో తేదీకి వాయిదా వేయాలని కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను సుప్రీం తోసిపుచ్చింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 12, ఆదివారమే జరుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
నీట్ పరీక్షకు సన్నద్ధులయ్యే విద్యార్థుల కోసం కాల్కస్ సంస్థ ఉచితంగా మాక్ పరీక్ష పత్రాల్ని రూపొందించింది. అందుకు సంబంధించిన పీడీఎఫ్ బుక్లెట్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సెప్టెంబరు 5న ఆవిష్కరించారు. సెప్టెంబరు 12న పరీక్ష జరగనున్న నేపథ్యంలో కాల్కస్ సంస్థ నిర్వాహకులు కోట- రాజస్థాన్, ఢిల్లీ, బెంగళూరులకు చెందిన ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోని అనుభవజ్ఞులైన అధ్యాపకుల నేతృత్వంలో దాదాపు 2వేల ప్రశ్నలతో కూడిన పది మాక్ ప్రశ్నాపత్రాల్ని రూపొందించారు. వాటిని గూగుల్ ప్లేస్టోర్లోని 'ecalcus classes' యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. లేదా 9133607607 వాట్సప్ నంబరుకు 'NEET' అని మెసేజ్ పంపించడం ద్వారా ఈ-బుక్ను పొందవచ్చని కాల్కస్ సంస్థ వ్యవస్థాపకురాలు వాణికుమారి తెలిపారు
https://calcusindia.com/tests/300/neet-ug-2021