True-Up charges: Electricity bills raises from September 2021 Month

 ప్రస్తుతం రాష్ట్రం లో అందరి నోట్లో నాన్నుతున్న ఒకే ఒక్క ప్రశ్న True-Up ఛార్జీలు అంటే ఏమిటి ?? ఇది ఎందుకు చెల్లించాలి ?? 

True-up claim is the expenditure incurred by the Discoms over and above the approved annual revenue requirement by the electricity regulatory commission due to variations in actual costs and would be collected from consumers concerned


విద్యుత్ ప్రసారం చేసే సంస్థలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదించిన రెవెన్యూ వ్యయం కన్న అధికంగా చేసిన వ్యయాన్ని వినియోగ దారులు నుంచి వసూలు చేసుకోవటం True-Up charges అంటారు..

విద్యుత్ సంస్థలు సుమారు 19000 కోట్లు True-Up ఛార్జీలు వసూలు చేసుకునేందుకు ప్రతిపాదనలు పంపగా రెగ్యులేటరీ కమిషన్ 3100 కోట్లు కి అనుమతి ఇచ్చింది..

కాబట్టి ఈ నెల నుంచి True-up అనే పదం మన జీవితంలో భాగం కానున్నది.

----------------

ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ

3వ నియంత్రణ కాలవ్యవధికి సంబంధించిన పంపిణీ వ్యాపారమునకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి వారు ఆమోదించిన ట్రూ అప్ చార్జీలపై సంక్షిప్త నివేదిక 

(ఆ॥సం॥ 2014-15 నుండి ఆ॥సం॥ 2018-19 వరకు)

ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎ.పి.ఎస్.పి.డి.సి.ఎల్, తిరుపతి) పంపిణీ, వ్యాపారమునకై 3వ నియంత్రణ కాలవ్యవధికి (ఆ॥సం॥ 2014-15 నుంచి 2018-19 వరకు) సంబంధించి రూ॥ 5889 కోట్లు ట్రూ ఆప్ చార్జీల ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ముందు 15-06-2020 న దాఖలు చేయడమైనది (ఒ.పి.సంఖ్య 34/2020).

ఈ ప్రదిపాదనలలలో ఎ.పి.ఎస్.పి.డి.సి.ఎల్. వినియోగదారులకు నాణ్యతమైన విద్యుత్ సరఫరా అందించడానికి, సంస్థ పటిష్ఠతకు ప్రస్తుతము వున్న కాలం చెల్లిన పాత లైన్లు మరియు నియంత్రికలు యొక్క స్థానములో క్రొత్త లైన్లు మరియు నియంత్రికలను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాలో నాణ్యత పెంచడానికి, ఓ& యం ఖర్చులు, తరుగుదల, పన్నులు, ఉద్యోగుల రక్షణ పరికరాలు మరియు ఇతర ఖర్చుల మొత్తాన్ని ఎ.పి.ఇ.ఆర్.సి. కమీషన్ వారు అనుమతించిన అంచనా విలవ కంటే ఎ.పి.ఎస్.పి.డి.సి.ఎల్. వారు చేసిన అభివృద్ధి పనుల విలువ ఎక్కువగా వున్నందున .ఈ ట్రూ అప్ చార్జీలను ప్రతిపాదించడమైనది. దీనిపై ఎ.పి.ఇ.ఆర్.సి. కమీనషన్వారు సమగ్రంగా పరిశీలించి ఈ ట్రూ అప్ ప్రతిపాదనను ఆమోదించడమైనది.

ఈ ప్రతిపాదనలపై ఎ.పి.ఇ.ఆర్.సి. వారు బహిరంగ విచారణను చేపట్టి 27-08-2021న కొన్ని మార్పులతో ఆమోదించడమైనది. పంపిణీ సంస్థ (ఎ.పి.ఎస్.పి.డి.సి.ఎల్.) దాఖలు చేసిన మరియు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదించిన ట్రూ అప్ చార్జీల వివరములను ఈ క్రింద పట్టికలో చూపబడినవి. 

ఎ.పి.ఇ.ఆర్.సి. వారు ఉత్తర్వులలో తెలిపిన కీలక అంశాలు :

ఆమోదించిన ట్రూ అప్ చార్జీలను ఆర్థిక సంవత్సరం 2021-22లోని మిగిలిన 8 నెలల కాల వ్యవవధిలో వినియోగదారుల నుండి వసూలు చేయుటకై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ సంస్థ వారు అనుమతించారు.

ఈ ట్రూ అప్ మొత్తాలను కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ (ఏ.పి.సి.పి.డి.సి.ఎల్., విజయవాడ) వారి వినియోగదారుల నుంచి కూడా వసూలు చేస్తారు. ఎందుకు అనగా ఆ॥ సం|| 2019-20 వరకు ఎ.పి.ఎస్.పి.డి.సి.ఎల్. సంస్థ నందు ఇది విలీనమై ఉన్నది.

01-04-2019 నుంచి నూతనముగా సరఫరా అందించబడిన వినియోగదారులకు ఈ ట్రూ అప్ చార్జీల నుంచి మినహాయింపు కల్పించడమైనది. ఈ ట్రూ అఫ్ చార్జీలను ఆర్థిక సంవత్సరం 2021-22లో ఆమోదించిన అమ్మకాలపై విధించి ప్రతి యూనిట్కూ వసూలు చేయవలసిన ట్రూ అఫ్ చార్జీలను గణించడమైనది ఈ చార్జీలను ఏకరీతిన అన్ని కేటగిరీల వినియోగదారుల నుండి (ఆగష్టు నెల వినియోగము సెప్టెంబరు నెల బిల్లు నుండి మార్చి నెల వినియోగము ఏప్రిల్ నెల బిల్లు వరకు) ఈ క్రింద పట్టికలో చూపిన విధంగా వసూలు చేయబడును.

ఈ ట్రూ అప్ చార్జీలు 2014-15 నుంచి 2018-19 వరకు ఉన్న పంపిణీ వ్యాపారమునకు సంబంధించి ఎ.పి.ఇ.ఆర్.సి. వారు ఆమోదించినవి. తప్పనిసరి పరిస్థితులలోనే ఈ చార్జీలను వినియోగదారుల నుండి వసూలు చేయబడును.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad