Communal Roaster Points & Seniority in Promotions

ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 5 (ఐ.ఇ.) తేది 14-2-2003 ప్రకారము పదోన్నతుల పోస్టుల యందు కూడ ప్రభుత్వములోని అన్ని శాఖలలోని, అన్ని కేటగిరి పోస్టులలో 15% ఎస్సిలకు,  6% ఎస్టిలకు రిజర్వేషన్ కల్పించబడినది. ఆ ఉత్తర్వును అమలు చేయుటకు మార్గదర్శక సూత్రాలు GO.Ms.No.21 Dt. 1 8-03-2003  ద్వారా విడుదలయినవి.

 అదే విధముగ 3% వికలాంగులకు కూడ రిజర్వు  చేయబడినవి. (GO.Ms.No.42 Dt. 19-10-2011) అంధ ఉద్యోగులకు పదోన్నతులకు అవసరమైన డిపార్ట్మెంట్ పరీక్షల నుండి 5 సంవత్సరములు మినహయింపు కలదు. (G0.Ms.No.748 GAD Dt:  29-12-2008 ).

 పదోన్నతులలో SC,ST & PHC కేటగిరీ లో అర్హులు దొరకానట్లయితే సంభందిత రోస్టర్ పాయింట్లు 2 సంవత్సరముల వరకు బ్యాక్ లాగ్ ఉంచాలి. రెండవ సంవత్సరం కూడా భర్తీ కానట్లయితే ఆ పోస్టులకు డీ - రిజర్వు చేసి తదుపరి సంవత్సరం మరల యధావిధంగా బ్యాక్ లాగ్ గా ఉంచాలి.

SC , ST కేటగిరి లలో మహిళలు లేనిచో పురుషులలో భర్తీ చేస్తారు. ( G.O.Ms.No.18 Dt:17.2.2005 )

సీనియారిటీ, ప్రమోషన్సు రిజిస్టర్ల గురించి తెలుసుకుందాం.

DSC లోని మెరిట్ ర్యాంకు, DOB ల సహాయంతోనూ, SC, ST,  PH, BC లకు కేటాయించిన రోష్టరు ప్రకారం తయారు చేసిన ప్రమోషన్ రిజిస్టర్నే మెరిట్ కం రోష్టరు రిజిస్టర్ అంటారు.

గౌరవ కోర్టువారు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారమే సీనియారిటీ లిష్టు తయారు చేయాలని తీర్పులిస్తున్నారు. గౌరవ భారత సుప్రీం కోర్టు వారు మెరిట్కి,రోస్టర్ ర్యాంకుకు అన్యాయం జరగకుండా పదోన్నతులు ఇవ్వాలని తీర్పునిచ్చింది. APSSSR 1996 రూల్సు నందుకూడా 33 నుండి 37 వరకు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం సీనియారిటీ లిష్టులు ఎలాతయారు చేయవలసి ఉందో స్పష్టంగా ఉన్నది.

* సీనియారిటీ లిష్టులు మెరిట్  కమ్  రోస్టర్ ప్రకారం తయారు చేసి, దీని ఆధారంగా  ప్రమోషన్సు రిజిస్టర్ తయారు చేయాలి. ఈ ప్రమోషన్సు రిజిస్టర్లో ప్రమోషన్సులో రిజర్వేషన్లు ఉన్న SC, ST, PH  అభ్యర్థులను రోష్టర్లో పెట్టి ప్రమోషన్సు ఇవ్వాలి .

* సీనియారిటీ రిజిస్టర్ (లిష్టు): ఒకే సారి(DSC) లో సెలక్టు కాబడిన వారందరూ డేట్ ఆఫ్ జాయినింగ్ తో సంభందం లేకుండా మెరిట్ కమ్ రోస్టర్( DSC Appointment)ర్యాంకు  ప్రకారం సీనియారిటీ లిష్టులు తయారు చేయాలి, ఈ రిజిస్టర్ ప్రకారం SC, ST, PH అభ్యర్థులు లిష్టులో చివరలో ఎక్కడ ఉన్నా మెరిట్ కమ్ రోష్టరు ప్రకారం ప్రమోషన్సు పొందుతారు.

3.  ప్రమోషన్సు రిజిస్టర్: ప్రమోషన్సులో రిజర్వేషన్లు ఉన్న SC (15%) , ST(6%), PHC (3%)  లకు  రోష్టరు పాయింట్లు  అడక్వసీ నిబంధనలకు లోబడి  వర్తిస్తాయి

*SC : General : 7,16,27,41,52,62,72,77,91,97 (మొత్తం : 10)    Women : 2,22,47,66,87 (మొత్తం : 5)

*ST : General : 25,33,75,83 (మొత్తం : 4)    Women : 8, 58 (మొత్తం : 2)

*PHC :  6 ( అంధత్వం  లేదా తక్కువ చూపు ) , 31 ( చెవుటి లేక మూగ  ) , 56 ( అంగవైకల్యం ).

 * Total Roaster Points : 24

మిగిలిన 76 పాయింట్లు అన్నీ ఓపెన్ కేటగిరీ క్రింద అందరికీ కలిపి (మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం) పదోన్నతులు ఇవ్వబడతాయి ఓపెన్ కేటగిరీలో OC, BC, SC, ST,PH అభ్యర్ధులు అందరూ మెరిట్  కమ్ రోస్టర్ ర్యాంకు (DSC Appointment Rank) ప్రకారం ప్రమోషన్సు పొందుతారు, SC, ST, PH లు   నిర్ణీత కోటా మేరకు పదోన్నతి పొందితే వారి కోటాలో అడక్వసీ చేరుకున్నట్లు. అప్పుడు వారి యొక్క  రోష్టరు పాయింట్లు జనరల్ గామార్చబడుతాయి. ఇదంతా ప్రమోషన్సు రిజిస్టర్లో ఉంటుంది.

 అడక్వసీ అంటే  : 

"ఒక కేడర్ పోస్టులకు సంబందించి, ఆ కేడర్లో SC,ST ,PH అభ్యర్థులు తమకు కేటాయించిన పర్సంటేజి మేరకు ఇప్పటికే పనిచేస్తూ ఉంటే ,ఆ కేడర్ లో అడిక్వసీ చేరుకున్నట్లు". అడిక్వసీ చేరుకుంటే తదుపరి ప్రమోషన్లకు రిజర్వేషన్ వర్తించదు.అప్పుడు వారి పాయింట్లు అన్నీ జనరల్‌ క్రింద మారతాయి. అప్పుడు అందరినీ కలిపి కామన్ గా మెరిట్ కమ్ రోస్టర్ (DSC Appointment Rank) ర్యాంకు ప్రకారం సీనియారిటి లిస్ట్ తయారు చేసి పదోన్నతులు ఇస్తారు.

(G.O.Ms.No. 2 dt: 9.01.2004 )

( G.O.Ms.No. 18 dt: 17.02.2005 )

***

వికలాంగ ఉద్యోగులకు పదోన్నతులలో 3% రిజర్వేషన్లు - విధివిధానాలు

 భారత ప్రభుత్వ సూచనలు అనువర్తించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 30 జులై 1991 నుండి ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 115 ద్వారా అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియమాకాల్లో అంగవికలురైన నిరుద్యోగులకు 3% రిజర్వేషన్లు ప్రవేశపెడుతూ 19 అక్టోబర్ 2011న ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 42ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 

ఉద్యోగుల సంఖ్య 5 కన్నా ఎక్కువ ఉన్న ప్రతి ప్రభుత్వ కేడర్లోను పదోన్నతులలో వికలాంగులకు రిజర్వేషన్లు  ఇవ్వాలి.

పాయింట్ల పదోన్నతి రోస్టర్లో 6, 31 మరియు 56 పాయింట్లను వికలాంగులకు కేటాయించాలి.

ఈ రిజర్వేషన్లు, సదరు పోస్టుకు పూర్తిగా అర్హతలున్నవారికే ఇవ్వాలి. విద్యార్హతలలో కానీ, శాఖాపరమైన పరీక్షల కృతార్ధతలో కాని ఎటువంటి మినహయింపు ఉండదు.

అంగవికలురు పనిచేయలేని కొన్ని పోస్టులకు తప్ప మిగిలిన అన్ని పోస్టులలో ఈ రిజర్వేషన్ విధానము అమలు

పరచాలి. ఏ డిపార్ట్మెంట్ అయినా దానిలో కొన్ని కేడర్లకు ఈ రిజర్వేషన్లు అమలు పరచుట సాధ్యం కాకపోతే రోజుల్లో ఈ ఉత్తర్వులు ఇవ్వని శాఖనుండి మినహయింపు (Exemption) కు అనుమతి పొందాలి.

పదోన్నతులలో వికలాంగుల6,31,56 రోస్టర్ పాయింట్లలో అభ్యర్థులు దొరకపోతే సీనియారిటీలో అట్టడుగున ఉన్న వికలాంగ అభ్యర్థిని సదరు పాయింట్స్లో ఉంచి పదోన్నతి కల్పించాలి. సీనియారిటీ జాబితాలో పైన ఉన్న అభ్యర్థి క్రింది రోస్టర్ పాయింట్ కు తీసుకురాకూడదు. అతడు/ఆమె కు అతని సీనియారిటీ ప్రాతిపదికనే పదోన్నతిగా ఇవ్వాలి.

ఈ పద్ధతిలో పదోన్నతులు ప్రతి కేడర్లో 3% వికలాంగ అభ్యర్థులు కోటా సంతృప్తి పడేవరకు కొనసాగాలి. అట్లు పూర్తయిన వెంటనే పదోన్నతులలో వికలాంగులకు రిజర్వేషన్లు సంబంధిత కేడర్లో నిలిపివేయాలి.

 పదోన్నతులలో వివిధ రకాల రిజర్వేషన్ అమలు పరుచు విధము (G.O.Ms.No.23 WCDE&DE Dt.26-5-2011) నియామకాలలో అనుసరించినట్లే వికలాంగులకు నిర్దేశించిన 3% రిజర్వేషన్లో గుడ్డివారికి 1%, చెవుడు/మూగవారికి 1%, చలనాంగాల వైకల్యత లేక మస్తిష్య పక్షవాతము ఉన్నవారికి 1% చొప్పున రిజర్వేషన్లు అమలు పరచాలి. వరుసగా 3 సైకిల్స్ లో వికలాంగులలో స్త్రీ లతో  సహా పై మూడు రకాల అంగవైకల్యము కలవారికి  పదోన్నతులలో రోస్టర్ పాయింట్లు కేటాయించాలి. 

 ఎస్.సి, ఎస్.టి.లకు పదోన్నతులలో రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. కావున ఈ వికలాంగ రిజర్వేషన్ కొరకు ప్రస్తుతం అమలులో ఉన్న రోస్టర్ జాబితానే కొనసాగించవచ్చును. కొత్తగా రోస్టర్ జాబితాను 1వ పాయింట్తో ప్రారంభించనవసరం లేదు . 

పై పాయింట్లలో 3 సైకిల్స్ పూర్తి అయిన తరువాత మరల 4వ సైకిల్ నుండి 6వ సైకిల్ వరకు ఆ పైన సైకిళ్లకు ఇదే విధానమును కొనసాగించుకోవాలి.

 ఒక ప్యానల్ లేక పదోన్నతి సంవత్సరములో ఒక వికలాంగ విభాగమునకు చెందిన అర్హుడైన అభ్యర్థి దొరకపోతే, మరుసటి సంవత్సరమునకు (Next Succeding Year) అదే విభాగానికి, ఆ పోస్ట్ ను క్యారీ ఫార్వర్డ్ చేయాలి.  మరుసటి సంవత్సరం కూడా అర్హుడైన అభ్యర్థి దొరకకపోతే ఈ 3విభాగాలలో మరొక విభాగమునకు గ్రుడి, చెవిటి, OH వరుసలో ఉన్న అంతరమార్పు (Interchange) చేసుకోవచ్చును. స్త్రీ అభ్యర్థి దొరకకపోతే పురుష వికలాంగునకు ఇవ్వవచ్చును.  

పై మూడు విభాగములలో దేనిలోనూ అభ్యర్థులు దొరకకపోతే రెండవ సంవత్సరము వికలాంగత లేని అభ్యర్థిచే ఆ పోస్టును పదోన్నతి ద్వారా భర్తీ చేయవచ్చును. 

 ఉదాహరణకు 6వ పాయింట్ వద్ద అర్హుడైన గ్రుడ్డి స్త్రీ అభ్యర్థి దొరకపోతే ఆ ఖాళీని తదుపరి పదోన్నతి  సంవత్సరమునకు క్వారీఫ్వార్డ్ చేయాలి. ఆ తదుపరి సంవత్సరము కూడా సదరు అభ్యర్థి దొరకకపోతే పురుష గ్రుడ్డి అభ్యర్థికి అవ్వాలి. పురుష అభ్యర్థి దొరకపోతే చెవిటి, మూగవారికి, వారుకూడా దొరకపోతే OH అభ్యర్థిచే పదోన్నతి ద్వారా భర్తీ చేయవచ్చును.

  అదే విధముగా 31వ రోస్టర్ పాయింట్లో చెవిటివారికి పదోన్నతి ఇవ్వవలసి యున్నది. మొదటిసారి ఆ అభ్యర్థి దొరకకపోతే తదుపరి సంవత్సరమునకు ఆఖాళీని క్యారీఫార్వర్డ్ చేయాలి. అప్పుడు కూడా అభ్యర్థి దొరకకపోతే మొదటగా OH అభ్యర్థికి అవకాశము ఇవ్వాలి. వారు కూడా దొరకకపోతే గ్రుడ్డివారికి అవకాశమివ్వాలి. ఈ ఇద్దరూ దొరకకపోతే సీనియారిటీ ప్రకారం అంగవైకల్యము లేని అభ్యర్థిచే ఆ పోస్టు భర్తీ చేయవచ్చును. 

ఇట్టే 56వ రోస్టర్ పాయింట్ వద్ద OH లేక మస్తిష్క పక్షవాతము ఉన్నవారికి పదోన్నతి ఇవ్వవలసియున్ని. మొదటిసారి ఆ అభ్యర్థి దొరకకపోతే తదుపరి సంవత్సరమునకు ఆ ఖాళీను క్యారీఫార్వర్డ్ చేయాలి. అప్పుడు కూడా అభ్యర్థి దొరకకపోతే మొదటగా గ్రుడ్డివారికి తరువాత చెవిటి, మూగవారికి అవకాశమివ్వాలి. వారు కూడా దొరకకపోతే సీనియారిటీ ప్రకారము వైకల్యత లేని అభ్యర్థికి అవకాశమివ్వాలి.

Related GOs & Proc : 

G.O.MS.No. 2 Dated: 19-02-2020  Providing four percent (4%) reservation in appointment and in promotions in every Government establishment in favour of benchmark disabilities as per the section 34 of the Rights of Persons with Disabilities Act, 2016

G.O.Ms.No.154 Dated.30–7-2008 Social Welfare Department - Rule of Reservation in promotions – Comprehensiveguidelines

G.O.Ms.No.5 dt:14.2.2003 Reservation in Promotions 

G.O.Ms.No. 2 dt: 09.01.2004 Policy of Provding Rule of Reservation in Promotions in favaour of SCs & STs

*  G.O.Ms.No. 21 dt: 18.03.2003 Policy of Providing Rules of Reservation in Promotions in favour of SCs & STs 

* G.O.Ms.No. 18 dt: 17.02.2005. In case there are no qualified women candidates available, for promotion to fill in the roster points earmarked for SC(Women) / ST (Women) the vacancies shall be filled by SC(Male) / ST (Male) candidates

G.O.Ms.No.16 dt: 17.02.2005 Policy of Providing Rules of Reservation in Promotions in favour of SCs & STs - Modification Orders

*  G.O.Ms.No. 42 dt: 19.10.2011 Providing Reservations in Promotions to the Differently Abled Employees

*  G.O.Ms.No. 23 dt: 26.05.2011 Providing Reservation in Promotions to the Differently Abled Employees in 3 Categories

G.O.Ms.No. 748 dt: 29.12.2008 Promotion to the higher posts - Visually Handicapped employees – Passing of Departmental Tests for promotion to next higher categories – 5 years time allowed

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad